మరికాసేపట్లో అమెరికా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో ఓ సువర్ణాధ్యాయం లిఖించబోతున్నారు.  మోడీ అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పర్యటిస్తున్నారు.  హ్యూస్టన్ లో ఈరోజు ఎన్ఆర్జీ ఫుట్ బాల్ స్టేడియంలో అమెరికన్ భారతీయులతో మాట్లాడబోతున్నారు.  ఈ కార్యక్రమానికి 50 వేలమంది ప్రజలు హాజరవుతున్నారు.  దేశచరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.  ఒక విదేశీ నాయకుడి సభకు ఈ స్థాయిలో ప్రజలు హాజరు కావడం ఇదే ప్రధమం.  


ఈ సభకు మోడీతో పాటు అటు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. అంతేకాదు, ఈ సభకు అమెరికన్ సెనేటర్లు కూడా హాజరవుతున్నారు.  డెమోక్రెటిక్, రిపబ్లికన్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.  రెండు పార్టీలకు చెందిన నాయకులు ఒక విదేశీ నాయకుడి కార్యక్రమానికి హాజరు కావడం అమెరికా చరిత్రలో ఇదే ప్రధమం.  


ఎవరూ ఊహించని విధంగా హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియం దీనికి వేదిక కావడం మరో విశేషం.  ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలోని ప్రతి దేశం కూడా ఎదురుచూస్తున్నది.  ఇక పాకిస్తాన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రపంచంలోనే సూపర్ శక్తిగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ఇండియాకు ఒక బూస్ట్ అని చెప్పాలి.  


ప్రపంచంలో ప్రతి దేశాన్ని శాసించే వ్యక్తిగా మోడీ ఎదుగుతున్నారు.  ప్రపంచ దేశాల్లో భారత్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో మోడీ తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇదే దూకుడును ప్రదర్శిస్తే.. అతి త్వరలోనే ఇండియా యునైటెడ్ నేషన్స్ లో భారత్ శాశ్వత సభ్యదేశంగా మారుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  అటు చైనా సైతం ఇండియాను చూసి భయపడుతున్నది.  పాక్ ను పక్కన పెట్టుకోవడం కంటే ఇండియాతో స్నేహం చేయడమే మంచిది అనే అవగాహనకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.  అది ఇంకెంతో దూరంలో లేదని తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్ధం అవుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: