జగన్ తాను పట్టిన పట్టు వదలడని .. పట్టుదలతో దేన్నైనా సాధిస్తాడని .. ఎవరిని లెక్కచేయడని జగన్ గురించి తరుచుగా వినిపించే మాటలు. ఇప్పుడు ఏపీ సీఎంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు .. కేంద్రం చెప్పినా వినకపోవడం ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా పీపీఏల ఒప్పందాల పునః సమీక్ష కు కేంద్రం జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతీ తెలిసిందే. జగన్ పీపీఏల ఒప్పందంలో తప్పుదోవ పట్టిస్తున్నాడని కేంద్రం ఎదురు దాడి చేస్తున్న పరిస్థితి. అయితే పీపీఏల ఒప్పందంతో పెట్టుబడులు ఎందుకు వెనక్కి వెళ్తాయో అర్ధం కాని పరిస్థితి. ఎటువంటి అవినీతి జరగకుండా ఉంటే పెట్టుబడులు ఎక్కడికి పోవు. మరీ కేంద్రం ఎందుకు జగన్ కు అడ్డు పడుతుందో అర్ధం కావటం లేదు.  పీపీఏల రద్ధు వల్ల రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు మిగిలిపోతాయని జగన్ భావిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం జగన్ నిర్ణయం వల్ల పెట్టుబడుల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పుకొస్తుంది.


ఈ విషయంలో తాజాగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని .. పీపీఏల ఒప్పందం పై ఎంత చెప్పినా జగన్ వినడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. అయితే పోలవరం విషయంలో కూడా జగన్ కు కేంద్రం మధ్య వార్ నడుస్తున్న సంగతీ తెలిసిందే.  అయితే జగన్ చర్యల పట్ల కేంద్రం చాలా అసహనంగా ఉంది. జగన్ ఎంత చెప్పినా వినడం లేదని .. వేరే సీఎంలు అయితే మనం  చెప్పిన మాట వినేవారని .. జగన్ పెద్ద మొండి ఘట్టమని ఢిల్లీ అధిష్ఠానం వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఇప్పుడు ఏపీలోని జగన్ ప్రభుత్వానికి .. కేంద్రానికి మధ్య దూరం పెరుగుతుంది. జగన్ చేస్తున్న పనులు కేంద్రానికి నచ్చడం లేదు. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కేంద్రం పదే, పదే వద్దని హెచ్చరిస్తుంది. ఇక పీపీఏల ఒప్పందం గురించి ఏకంగా కేంద్ర మంత్రి జగన్ కు లేఖ రాశారు. పీపీఏ ఒప్పందాల వల్ల పెట్టుబడులు ఆగిపోతాయని .. అయితే ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రం గట్టిగానే స్పందిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: