సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే పది నెంబర్లు ఉంటాయి.  దేశానికీ సంబంధించిన కోడ్ ఉంటుంది.  లోకల్ లో ఉండే కోడ్ టైపు చేయాల్సిన అవసరం లేదు.  అయితే, ఇప్పుడు పది కాదు 11 నెంబర్లుగా ఫోన్ నెంబర్లు మారబోతున్నాయా అంటే అవును అనే అనిపిస్తోంది.  సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మొదట 9 సీరీస్ తో ఫోన్ నెంబర్లు మొదలయ్యాయి, తరువాత 8, 7 నెంబర్లతో ఫోన్ నెంబర్లు ఉన్నాయి.  


అయితే, 9,8,7 సీరీస్ వంటి నెంబర్లు కేవలం 250 కోట్ల వరకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది.  ఈ సంఖ్య దాటితే పది నెంబర్ల ఇవ్వడం కుదరదు.  2050 వ సంవత్సరం తరువాత పది నెంబర్లు కలిగిన మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం అసాధ్యం అంటున్నాయి టెలికాం కంపెనీలు.  దానికి  పరిష్కారం ఏంటి.. ఎలా నెంబర్లు ఇవ్వాలి.. అంటే దానిపైనే ప్రస్తుతం టెలికాం కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి.  


టెలికాం కంపెనీల సమాచారం ప్రకారం ఇకపై 11 నెంబర్లతో మొబైల్ ఫోన్లు పనిచేస్తాయని, 11 నెంబర్లు కలిగిన వాటిని త్వరలోనే ప్రవేశపెడతారని అంటున్నారు.  అయితే, ఎప్పటి నుంచి ఈ నెంబర్లు అందుబాటులోకి వస్తాయి అనే విషయం తెలియాల్సి ఉన్నది.  ఇప్పటికే ఇండియాలో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.  ఒకటికాదు రెండు కాదు ప్రతిరోజు కోట్లసంఖ్యలో ప్రజలు కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారు.  


కొత్త మొబైల్ కనెక్షన్లు తీసుకునే వాళ్లకు కొత్త కొత్త నెంబర్లు అలాట్ చేస్తున్నారు.  అయితే, మూడు నెలలు ఒక నెంబర్ వాడకుండా ఉంటె ఆ నెంబర్ వాడుకలోనుంచి వెళ్ళిపోతుంది.  ఫలితంగా ఆ నెంబర్ ను మరొకరికి కేటాయిస్తారు.  ఇది మంచి పద్దతే..జీయో అందుబాటులోకి వచ్చిన తరువాత 6 సీరీస్ తో కూడా నెంబర్లు వస్తున్నాయి.  ఇప్పుడు ఎక్కువగా జీయో సీరీస్ నుంచి ఈ నెంబర్లతో మంచి పరిణామమే.  త్వరలోనే 5 సీరీస్ తో కూడా నెంబర్లు రావొచ్చు.  అయితే, 11 మరో 20 ఇళ్లల్లో 10 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్ల తో పాటు 11 అంకె కలిగిన ఫోన్ నెంబర్లు కూడా కనిపిస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: