- రెండు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసి ఈసీ
- బీజేపీకి స‌వాల్‌గా మారిన ఎన్నిక‌లు


దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు తెర‌ప‌డింది. అయితే  సెప్టెంబర్ 21 ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు ఈ రాష్ట్రాల‌కే కాదు...దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నా 64 స్థానాలకు కూడా ఈ ఎన్నిక‌ల న‌గారా మోగింది. అయితే ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసిన ఈ రెండు భారతీయ జ‌న‌తాపార్టీ అధికారంలో ఉంది. ఈ సారి మాత్రం మ‌హారాష్ట్ర‌ర ఎన్నిక‌లు మాత్రం ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నున్నాయి. అక్టోబ‌ర్ 21న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండ‌గా, వీటిలో 234 జ‌న‌ర‌ల్‌, 29 షెడ్యూల్ కులాలు, 25 షెడ్యూల్ తెగ‌ల‌కు చెందిన స్థానాలు కేటాయించారు. అయితే ఈ రాష్ట్రాల్లో ఈసారి నువ్వా..నేనా అన్న‌ట్లు  బ‌రిలో దిగ‌నున్నారు అభ్య‌ర్థులు. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత నేత‌లు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఎవ‌రి వారే ధీమాలో ఉన్నారు. 


ఏ విధంగానైనా బీజేపీని ఓడించి  తాము అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అంతేకాదండోయ్ అందుకు త‌గిన‌ట్లుగా ముందు నుంచే పావులు క‌దుపుతున్నారు.  కాంగ్రెస్‌తో చేతులు  క‌లిపి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇరు పార్టీలు 50-50 ప్రాతిపదికన మొత్తం 250 స్థానాల్లో పోటీ చేస్తాయని, .మిగతా 38 స్థానాల్లో చిన్న పార్టీలు పోటీలో ఉంటాయని చెప్పారు. అయితే అధికారికంగా ఇరు పార్టీలు ఇంకా సీట్ల సర్ధుబాటు గురించి మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ సారి శివసేనతో పొత్తు పెట్టుకుంటుందా.. లేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాల ఎన్నిక‌లు బీజేపీకి స‌వాల్‌గా మారాయి.


అయితే శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మాత్రం బీజేపీతో కలిసి ఈ సారి ఎన్నికల్లో దిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. మరోవైపు కొందరు బీజేపీ నేతలు మాత్రం ఈ సారి పార్టీ ఒంటరిగానే రంగంలోకి దిగ‌నున్న‌ట్లు, అమిత్ షా కూడా సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు తగిన ప్రయ‌త్నాలు కొన‌సాగిస్తున్నార‌ని అంటున్నారు కమ‌లం నేత‌లు. 
అయితే మోడీ ప్ర‌ధానికి అయిన త‌ర్వాత  మొద‌టి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఎన్నిక‌ల‌కు మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకొంది 2014లో జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ బీజేపీ 122 స్థానాలను కైవసం చేసుకుంది. మ‌రి స‌ర‌వ‌త్త‌రంగా సాగే  ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు పీటం  కైవ‌సం చేసుకోనున్నారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: