ఉద్ధానం భాదితుల విషయంలో పవన్ అప్పట్లో బాగానే పోరాడారు. తరువాత ఏమైందో పవన్ అటు మళ్ళీ వెళ్ళలేదు. అయితే జగన్ ప్రభుత్వం ఉద్దాన భాదితుల కోసం మంచి నిర్ణయం తీసుకున్న సంగతీ తెలిసిందే. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న జగన్ ఏదైనా మంచి పని చేస్తే ప్రతిపక్షాలు మెచ్చుకోవాలి. లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తే విమర్శించాలి. అంతేగాని ప్రతిదానికి అధికార పార్టీని విమర్శిస్తే ప్రజల్లో చులకన అయిపోతారు. ఒకప్పుడు ఉద్దాన భాదితుల కోసం పోరాడిన పవన్ ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకుంటే మెచ్చుకోకుండా తన ఇగో చూపిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్దాన కిడ్నీ భాదితుల కోసం 200 పడకల హాస్పిటల్ ను .. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది.


జగన్ చేస్తున్న ఈ మంచి పని పట్ల పవన్ గారు అసలు స్పందించడం లేదు. గత ప్రభుత్వంలో బాబు గారితో బాగా తిరిగారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారే సరికే జగన్ చేస్తున్న గొప్ప పనులు కూడా పవన్ మేధావికి నచ్చడం లేదు. ఇప్పుడు కూడా పవన్ స్పందించకపోతే సంకుచిత రాజకియాల కోసమే పవన్ ఉన్నారని అర్ధం చేసుకోవాలి. ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ .. టీడీపీర్ రెండు ఒకటేనని వైసీపీ ప్రధానంగా ఆరోపించింది. ఎన్నికల ముందు విడిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నాడని పవన్ ను జగన్ విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ శైలి కూడా జనాల్లో జనసేనకు టీడీపీకి మధ్య బంధం ఉందని నమ్మారు. ఎన్నికల్లో జనసేన ఓటమికి ప్రధాన కారణం కూడా అదే.


అయితే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ మనిషేనని పవన్ కల్యాణే నిరూపిస్తున్నారు. రాజధాని వ్యవహారంలో అతిగా స్పందించి  టీడీపీ .. నేను ఒకటేనని సిగ్నల్స్ పంపిస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు. దీనితో జనసేన ఇంకా ఘోరమైన స్థితిలోకి పోతుంది. ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: