అంగవైకల్యంతో  ఉన్నారంటే వారిపై సాధారణంగా ఎవరైనా జాలి చూపిస్తారు. వీలైతే వారికి అవసరమైన సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ విశ్వవిద్యాలయంలోని సిబ్బంది మాత్రం వికలాంగుడైన వ్యక్తితో అమానుషంగా ప్రవర్తించారు. విశ్వవిద్యాలయం అంటే విజ్ఞానాన్ని పంచే వేదిక. విద్యార్థులను సన్మార్గంలో నడిపే మహావృక్షమైన విశ్వవిద్యాలయం ఎస్వీయూలో ఇంఛార్జీ రిజిస్ట్రార్ తీరు యూనివర్సిటీ పేరుకే మచ్చ తెచ్చేలా ఉంది. 
 
ఉన్నత చదువులు చదివితే సరిపోదు. ఆ చదువుతో పాటు సంస్కారం కూడా తెలిసి ఉండాలి. అధికారాన్ని పొందటం గొప్ప కాదు. ఆ అధికారంలో ఉన్న సమయంలో ప్రవర్తించే తీరు కూడా పద్దతిగా ఉండాలి. కానీ ఎస్వీయూలోని ఇంఛార్జీ రిజిస్ట్రార్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పెండింగ్ బిల్లుల కోసం వచ్చిన వికలాంగుడైన వ్యక్తితో విద్యను పంచే విశ్వవిద్యాలయంలోని ఇంఛార్జీ రిజిస్ట్రార్ కార్యాలయంలో గట్టిగా అరుస్తూ, వేలు చూపించి బెదిరిస్తూ, 30 నిమిషాల సమయం పాటు నిర్భంధించి, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న ఎస్వీయూ ఇంఛార్జీ రిజిస్ట్రార్ తీరు, ఆ సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది తీరు సరికాదు. 
 
తప్పు చేసిన సిబ్బంది పదిరోజులైనా తమ తప్పును ఎందుకో గుర్తించటం లేదు. నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్వీ యూనివర్సిటీలోని కొంతమంది సిబ్బంది తీరు, వికలాంగుడైన వ్యక్తితో ప్రవర్తించిన తీరు ప్రభుత్వం దృష్టికి వెళితే వికలాంగుడైన వ్యక్తికి న్యాయం జరిగే అవకాశం ఉంది. 
 
65 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాకు మాత్రమే కాక ...యావదాంధ్రకు మేధో భాండాగారమై, కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరు మీద నడపబడుతున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం... జన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారి జనప్రియ పారదర్శక పాలనోలనన్నా ప్రక్షాళన కావింపబడి తెలుగు జాతికే గర్వకారణంగా నిలువాలనేదే ... స్వప్రయోజన-స్వార్ధాలకు పాల్పడే వారు కాకుండా యూనివర్సిటీని అభివృద్ది పథాన నడిపే వారు నాయకులుగా ఉండి అందరి హక్కులనూ కాపాడాలనేదే ఈ పోరాట అంతిమ లక్ష్యం. 
 
 



వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు: 


మరింత సమాచారం తెలుసుకోండి: