ఒక్కోసారి చిన్న చిన్న ఆలోచనలు జీవితాన్ని పెద్దగా మార్చేస్తుంటాయి.  కొందరికి అసలేం చేయాలో తెలియదు. 24 గంటలు అలా ఊరికే ఖాళీగా కూర్చుంటారు.  ఎదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. చివరకు వచ్చే సరికి అక్కడ ఏమీ ఉండదు. చాలా మంది యువత ముందు వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారో దానిపై సరైన అవగాహనా లేకపోవడంతోనే అన్ని అనర్ధాలు జరుగుతున్నాయి.  కొంతమంది మాత్రం చేయాలి అనుకున్న పనిని ఎంత కష్టమైనా సరే చేసేస్తుంటారు.  


ఇదిలా ఉంటె, ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉంటున్న రాణి కిన్నర అనే ట్రాన్స్ జెండర్ ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.  తోటి ట్రాన్స్ జెండర్స్ కు మార్గదర్శకంగా నిలుస్తున్నది.  ట్రాన్స్ జెండర్ లు మాములుగా ఉద్యోగాలు వంటివి చేసేందుకు ఇష్టపడరు.  ట్రైన్స్ లో డబ్బులు వసూలు చేస్తుంటారు.  లేదంటే.. షాప్స్ లో వసూలు చేస్తుంటారు.  వాళ్ళు అడిగితె తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలి.  అది ఆనవాయితీగా వస్తోంది.  


అయితే, ఈ ట్రాన్స్ జెండర్ కూడా మొదట్లో ట్రైన్ లో డబ్బులు వసూలు చేస్తుండేది.  ఎందుకో అది నచ్చలేదు.  ఒకరిపై ఆధారపడి బ్రతకడం నచ్చలేదు.  అందుకే ఓ చికెన్ షాప్ లో జాయిన్ అయ్యింది.  కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది.  కష్టపడి పనిచేస్తూనే డబ్బులు సంపాదించింది.  ఆ తరువాత అది కూడా ఆమెకు పెద్దగా నచ్చలేదు.  వెంటనే, ఆటో నేర్చుకుంది.  ఆటో నేర్చుకొని అధీకు తీసుకొని నడపడం మొదలుపెట్టింది.  కానీ, ట్రాన్స్ జెండర్ ఆటో ఎక్కేందుకు పెద్దగా ఎవరూ ఉత్సాహం చూపలేదు.  


కానీ, ఆమె తగ్గలేదు.  అంతేకాదు, ఎలాగైనా గెలవాలని అనుకుంది.  జీవితంలో పట్టుదల నేర్చుకుంది.  గెలుపుకోసం పోరాటం చేయడం మొదలుపెట్టింది. గెలుపును ఆసరాగా చేసుకొని మరో గెలుపుకోసం ప్రయత్నం మొదలుపెట్టింది.  ఆటో డ్రైవర్ నుంచి క్యాబ్ డ్రైవర్ గా మారింది.  క్యాబ్ డ్రైవర్ గా ఇప్పుడు మంచిగా సంపాదిస్తోంది.  తన గురించి అడిగిన వాళ్లకు ఇదే విషయం చెప్తున్నది.  జీవితాన్ని వృధా చేసుకోకుండా తనకు తానుగా సంపాదించుకుంటున్నానని రాణి పేర్కొన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: