పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందిరకీ అవే అనుమానాలు వస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి ఉన్నపుడు కూడా చంద్రబాబునాయుడుకు మద్దతుగాను వ్యతిరేకంగాను కమలనాధులు రెండుగా చీలిపోయిన విషయం అందరూ చూసిందే. అయితే ఎప్పుడైతే పొత్తుల నుండి విడిపోయారో అప్పటి నుండి చాలామంది బిజేపి నేతలు చంద్రబాబంటే మండిపోయింది కూడా చూశారు.

 

సరే అదంతా చరిత్ర అనుకుంటే బిజేపిలో జరుగుతున్న  తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఇపుడు కూడా కమలం పార్టీలో నేతలు రెండుగా చీలిపోయినట్లు అర్ధమవుతుంది. అప్పట్లో అంటే పొత్తులున్నపుడు వెంకయ్యనాయుడు వల్లే చంద్రబాబుపై వ్యతిరేకత ఉన్నా చాలామంది నేతలు బయటపెట్టలేదు. అలాంటిది పొత్తులు విడిపోయిన తర్వాతే చాలామంది చంద్రబాబును వాయించేశారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత వాయింపులు మరింతగా పెరిగిపోయింది.

 

అలాంటి వాయింపులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.  ఎప్పుడైతే టిడిపి నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజేపిలోకి ఫిరాయించారో అప్పటి నుండే మళ్ళీ కమలనాధుల్లో చీలక మొదలైంది. ఫిరాయింపుల్లో కూడా ముఖ్యంగా సుజనా చౌదరి బిజెపిలోని రాష్ట్ర నేతల్లో చాలామందిని మ్యానేజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాని వల్లే చంద్రబాబు అంటే కొందరిలో సాఫ్ట్ కార్నర్ మొదలైందట.

 

కొంతమంది బిజెపి నేతలు చంద్రబాబును పూర్తిగా విమర్శిస్తు, ఆరోపణలు చేస్తుంటే మరికొందరు నేతలేమో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చంద్రబాబును పైపైన విమర్శిస్తునే జగన్ పై ఎక్కువ దృష్టి పెట్టిన విషయం తెలుస్తోంది.

 

తాజాగా విష్ణవర్ధన్ రెడ్డి, రావెల కిషోర్ బాబు లు మాట్లాడుతూ కరకట్టపై అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలని డిమాండ్ చేయటంతో అందరూ ఆశ్చర్యపోయారు. కరకట్ట నిర్మాణాల కూల్చివేతలపై ఇప్పటి వరకూ ఏ బిజెపి నేత కూడా ఇంత గట్టిగా డిమాండ్ చేసింది లేదు. ఇంకెంత మంది నేతలు కరకట్ట నిర్మాణాల కూల్చివేతలపై గట్టిగా మాట్లాడుతారో చూడాల్సిందే. చూడబోతే బిజెపిలో చంద్రబాబు పెట్టిన చిచ్చు గట్టిగానే ఉన్నట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: