మ‌ద్యం ప్రియుల‌కు శుభ‌వార్త‌. ఏపీలో మద్యం తాగేవార‌రికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు మ‌ద్యం షాపు వారు. రాష్ట్రంలో నూత‌న మ‌ద్యం పాల‌సీ రానుంది. ఈ నేప‌థ్యంలో వారి వారి లైసెన్సు గ‌డువు ముగిసిపోనుంది. అయితే వారి వ‌ద్ద‌నున్న మ‌ద్యం స్టాకును వ‌దిలించుకునేందుకు మ‌ద్యం ప్రియుల‌కు తీపి క‌బురు అందించే వినూత్న ప‌ద్ద‌తిని అనుస‌రించారు. అయితే ఆయా మ‌ద్యం షాపుల్లో ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్ల‌పై భారీగా ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ మ‌ద్యం ప్రియుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. అస‌లు మ‌ద్యం షాపు ఏ ఏరియాలో ఉన్న అడ్ర‌స్ మాత్రం ట‌క్కును తెలిసిపోతుంది. అలాంటి ఇప్పుడు భారీగా ఆఫ‌ర్ ఇస్తున్నామంటే ఊరుకుంటారా...?ఇంకా ఎగ‌బ‌డి, ఎగ‌బ‌డి క్యూలు క‌డుతుంటారు. ఖరీదైన, డిమాండ్‌ లేని బ్రాండ్లను ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని చూస్తున్నారు. పలు బ్రాండ్లపై బంప‌ర్‌ ఆఫర్లు అంటూ ప్రకటిస్తూ మద్యాన్ని చౌకగా అమ్మేస్తున్నారు.  దీంతో మ‌ద్యం బాటిల్‌పై  రూ.500 వరకు త‌గ్గించిన‌ట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ షాపులో ఏకంగా సీసాపై రూ.600 తగ్గించి అమ్ముతుండ‌టం గ‌మ‌నార్హం.  ధరలు తగ్గించిన విషయాన్నిఆ షాపు యజమానులు వాట్సాప్‌ ద్వారా ‘మాన్సూన్‌ ఆఫర్లు’ అంటూ జోరుగా ప్ర‌చారం సాగిస్తున్నారు. ఇంకేముంది మ‌ద్యం ప్రియుల‌కు పండ‌గ‌లా మారింది. ఎగ‌బ‌డి, ఎగ‌బ‌డి క్యూలు క‌డుతున్నారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఆఫర్లు పెట్టి స్టాకు ఉన్న మ‌ద్యాన్ని విక్ర‌యిస్తున్నారు.
 
అయితే ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే...డిమాండ్‌ లేని ప‌లు బ్రాండ్లను ఎలాగోలా అమ్ముకోవాల‌నే అతృత‌తో ఈ స‌మ‌యంలోనైనా కొంత మేర‌కు ధరలు తగ్గించారు. విశాఖపట్నం ఇతర నగరాల్లో కూడా ఈ ఆఫర్లు కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే రూల్స్ ప్రకారం మద్యం గురించి ప్రచారం చేయడంగానీ, ఆఫర్లు ప్రకటించడంగానీ ఉల్లంఘన కిందకే వ‌స్తుంది. విజయవాడలోని ఎక్సైజ్‌ పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతోందని ప‌లువురు బాహ‌టంగానే చెబుతున్నారు. అయినా అధికారులు ఇంతైనా పట్టించుకోవడం లేదని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత మ‌ద్యం షాపుల‌ను త‌గ్గించే ప‌నిలో ఉన్న విష‌యం తెలిసిందే. చాలా వ‌ర‌కు మ‌ద్యం షాపులు త‌గ్గిస్తూ మ‌ద్య నిషేధం దిశ‌గా అడుగులు వేస్తోంది ఏపీ స‌ర్కార్‌. ఈ నెల 1 నుంచి కొత్త మ‌ద్యం పాల‌సీ అమ‌ల్లోకి రానుంది. ప్రభుత్వ మద్యం షాపులు మాత్రమే పనిచేయనున్నాయి. గ‌డువు ముగిసే స‌మ‌యానికి మ‌ద్యం మిగిలితే వాటిని ఎక్సైజ్‌ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. అయితే, ఇలా స్వాధీనం చేసుకున్న మద్యానికి లైసెన్స్‌లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అధికారులు. దీంతో మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌కు ఇవ్వడం కంటే ఎంతో కొంతకు అమ్ముకోవడం బెట్ట‌ర్ అని వ్యాపారులు ఇలా ఆఫ‌ర్ ఇస్తూ...ఈ బాట ట్టారు మ‌ద్యం వ్యాపారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: