భారతదేశమంతటా సెప్టెంబర్ 1వ తేదీ నుండి కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలులోకి రానప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీగా జరిమానాలు ట్రాఫిక్ పోలీసులు విధిస్తూ ఉండటంతో వాహనదారులు కొన్ని రాష్ట్రాల్లో బస్సులు, ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. మరికొందరు అన్ని పత్రాలు ఉంటే మాత్రమే వాహనాల్ని రోడ్ల మీదకు తెస్తున్నారు. 
 
ప్రజలనుండి ఈ చట్టంపై చాలానే విమర్శలు వస్తున్నా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవటం విశేషం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్థాయిలో జరిమానాలను విధించకుండా ప్రజలు ఆమోదించే విధంగానే జరిమానాలను విధించాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని సమాచారం. 
 
ఏపీ రాష్ట్ర రవాణా కమిటీ జరిమానాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికను పంపటం జరిగింది. ఈ నివేదికకు ప్రభుత్వం ఆమోదం ఇస్తే కొత్త ట్రాఫిక్ జరిమానాలు అమలులోకి వస్తాయి. రవాణా శాఖ అధికారులు సిద్ధం చేసిన నివేదికలో రోడ్డు నిబంధన అతిక్రమిస్తే 250 రూపాయలు, అర్హత లేకుండా వాహనం నడిపితే 4,000 రూపాయలు, ప్రమాదకరంగా వాహనం నడిపితే 2,500 రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది. 
 
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 2,500 రూపాయలు, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1,250 రూపాయలు, సీటు బెల్ట్ కు 500 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కు 5,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త మోటారు వాహన చట్టంతో పోలిస్తే జరిమానాలు దాదాపుగా సగం తగ్గాయి. ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: