తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ముఖ్యమంత్రులకు రాజ గురువుగా ఉన్న విశాఖ పెందుర్తి శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర మహా సరస్వతి అంటే ఆధ్యాత్మికపరులు సైతం ఆసక్తిని కనబరుస్తారు. ఆయన రాజకీయాల విషయం పక్కన పెడితే హిందూ ధర్మంపై స్వామీజీ సాగిస్తున్న ప్రచారాన్ని, చిత్తశుద్ధిని అంతా నమ్ముతారు. విశాఖలో స్వామీజీకి ప్రధాన ఆశ్రమం ఉంది. ఇక్కడికే కేసీయార్, జగన్ కూడా ఆరు నెలల వ్యవధిలో వచ్చారు.


చిత్రమేంటంటే ఇద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా అయ్యాకనే ఇక్కడకి రావడం జరిగింది. ఇక స్వామీజీల  పట్ల కేసీయార్ కి భక్తి మెండుగా ఉంది. ఆయన తరచూ వారిని పిలిచి యాగాలు, హోమాలు చేస్తూంటారు. పెందుర్తి స్వామీజీఅ అంటే మరింత భక్తి ఉంది ఆయనకు ఆ భక్తితో హైదరాబాద్ కోకాపేట వద్ద రెండు ఎకరాల భూమిని ఎకరం రూపాయి వంతున రెందు రూపాయలకు ఇచ్చారు. జూన్ లో జరిగిన మంత్రి వర్గ సమాఏశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


రంగారెడ్డి జిల్లా గండి పేట మండలం కొత్తపేట గ్రామం సర్వేనెంబర్ 240 లో భూమిని కేటాయిస్తూ కేసీయార్ సర్కార్  జీవోను సైతం జారీ చేసింది. అంతవరకూ కధ బాగానే ఉన్నా దాదాపుగా యాభి కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని ఎలా కేటాయిస్తారంటూ హైదరాబాద్ కి చెందిన హెచ్ వీరాచారి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్లో  ఈ జీవోను వెంటనే రద్దు చేసి ప్రభుత్వం భూమిని వెనక్కు తీసుకోవాలని కోరారు.


నిజంగా ఈ పరిణామం స్వామీజీకి షాకింగ్ లాంటిదేనని   చెప్పాలి. స్వామీజీ అక్కడ శారదా శక్తి పీఠం గా అభివ్రుధ్ధి చేయాలనుకుంటున్నారుట. అదే విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యకలాపాలు  నిర్వహించాలనుకుంటున్నారుట. మరి ఈ విషయంలో ఉదారంగా కేసీయార్  ప్రభుత్వ భూమిని ఇవ్వడాన్ని కోర్ట్ ఏ విధంగా పరిగణిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: