ప్రపంచంలోనే యువత శాతం జనాభాలో ఎక్కువగా ఉన్న దేశం మన భారత దేశం. రానున్న దశాబ్దంలో మన భారత దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి యువతను సక్రమమైన మార్గంలో నడిపించి... వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వైపుకు నిర్దేశించాల్సిన యూనివర్సిటీ లోనే నేడు తమ విలువలను మరిచిపోయి కనీస మానవతా విలువలు పాటించకుండా ఒక నిస్సహాయుడైన వికలాంగుడి పై దాడి చేయడం చాలా దురదృష్టకరం. ఇదంతా గత పది రోజులుగా ఎటువంటి వివరణ మరియు సమాధానం ఇవ్వని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధికారులను ఉద్దేశించే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్చార్జి రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిన ఈ ఘోరమైన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేకపోవడం చింతించాల్సిన విషయమే. ఏదో రాజకీయ లబ్ధి కోసం అమానుషంగా ఒక వ్యక్తిని హింసించి అతని చేత పని చేయించుకోవడం అనేది ఆమోదయోగ్యమైన విషయం అయితే ఖచ్చితంగా కాదు. భగవంతుడు తనకు ఇచ్చిన లొపాన్ని పక్కనపెట్టి మరీ సభ్య సమాజంలో తన కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న అతనిపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం...?

దీని వెనక ఎటువంటి కారణాలు ఉన్నా... ఒక బాధ్యత కలిగిన మీడియా పోర్టల్ వారిని ఉద్దేశించి ఇంత వివరిస్తే కనీసం కినుకుమనకుండా.... ఎటువంటి సమాధానం ఇవ్వక పోవడం రానున్న రోజుల్లో కూడా వారి వైఖరికి దర్పణం పడుతుంది. ఆ విద్యాలయంలో తాము ఏం చేసినా ప్రశ్నించేవారు కరువైన నేపధ్యంలో తమ ఆగడాలకు అడ్డూ అదుపు లేదు అన్నదే వీరి వైఖరి అంటారా..? లేదా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ఇలా నిస్సహాయుడిపై విరుచుకుపడడం వీరు వ్యక్తిత్వానికి నిదర్శనం అంటారా…? సమీప కాలంలో ఇటువంటి ఘటనలో ఆగే పరిస్థితి లేదంటారా…?


మరింత సమాచారం తెలుసుకోండి: