దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవరించిన ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు సీబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది.  అప్పట్లో కార్ల కర్మాగారం ఏర్పాటు అంశం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రూ. 11 కోట్ల ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.  సీబీఐ విచారణ చేపట్టిన ఈ కేసులో బొత్స సాక్షిగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారించింది. వోక్స్ వ్యాగన్ కేసులో హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారు. 


అయితే, తమకు వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఫోక్స్ వ్యాగన్ ప్రకటించింది. ఈ అంశంలో అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం కేసును సీబీఐకి అప్పటి ముఖ్యమంత్రి  రాజశేఖరరెడ్డి అప్పగించారు. ఆ మేరకు 2005లో సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారించింది. దానితో దాదాపుగా 3 వేల పేజీలతో కూడిన చార్జ్ షీట్ ను సీబీఐ కోర్టుకు దాఖలు చేసింది
 

ఈ సంస్థ కోసం వశిష్ట వాహన్ అనే సంస్థకు రూ. 11 కోట్లు చెల్లించిన కుంభకోణంలో సాక్షిగా బొత్స కోర్టుకు హాజరవుతారు. ఈ కేసులో అళగ రాజా, వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్, జైన్, గాయత్రిలపై బీసీఐ అభియోగాలు మోపింది. కేసులు నమోదు చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విశాఖలో కార్ల ఫ్యాక్టరీ స్థాపన కోసం ఫోక్స్ వ్యాగన్ కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్ల రూపాయలను చెల్లించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: