అనుమానం పెను భూతం అంటారు.ఈ అనుమానాలు అనేవి ప్రజల్లో ఎంతగా పాతుకుపోయాయంటే ఎవరు ఏది చెప్పిన జనం నమ్మేస్తారు.ఆవార్తను క్షణాల్లో అంతా గుప్పుమని విస్తరింప చేస్తారు.అలాంటిదే ఈ సంఘటన.ఆ ఆస్పత్రిలో దైయ్యం వుందట, అక్కడవున్న చైర్ దానంతట అదే కదులుతుందట.కొంతమంది దీన్ని మూఢ నమ్మకం మాత్రమేనని కొట్టి పడేస్తే..మరికొందరు అది వాస్తవమేనని చెబుతారు.వారు విన్న,లేదా ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు.వాటికి తగిన ఆధారాలు లేకపోవడం వల్ల ఎవరూ పూర్తిగా నమ్మరు.అయితే,నమ్మాలో లేదో అని ఆలోచించేలా ఓ సంఘటన జరిగింది.



ఇంతకు ఎక్కడంటే,చండీఘడ్‌లోని ఓ హాస్పిటల్‌ల్లో..చండీఘడ్‌లో వున్న పీజీఐ హాస్పిటల్‌లో ఓ వీల్ ఛైర్ ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే కదిలిందట.ఈ ఘటన సెక్యూరిటీ గార్డు కళ్లముందే జరిగిందట.ఇదంతా హాస్పిటల్‌లో ఉన్న సీసీటీవీ కెమేరాలో కూడా రికార్డైందట.తొలుత అది గాలి వల్ల కదిలి ఉంటుందని భావించాడట గార్డు. బయటకువెళ్లి చూస్తే..గాలి వీయక పోగా దాన్ని ఎవరో ముందుకు తీసుకెళ్తున్నట్లుగా అనిపించిందట.ఇది నమ్మలేని అస్పత్రి సిబ్బంది సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియోలను పరిశీలించగా.. ఆ కుర్చీ దానంతట అదే కదలడాన్ని గమనించారట.



అది గాలివీచి కదులుతే దాని పక్కనే ఉన్న వస్తువులు కూడా కదలాలి ,కానీ వీల్ ఛైర్ మాత్రమే ఎందుకు కదులుతుందని అంటున్నారు సిబ్బంది.దీంతో ఆ హాస్పిటల్‌లో చనిపోయిన వ్యక్తుల ఆత్మవల్లే ఆ వీల్ ఛైర్ కదిలి ఉంటుందనే ప్రచారం మొదలైంది.ఇదివరకు కూడా ఈ హాస్పిటల్‌లో కొన్నినెలల క్రితం ఇలాంటి ఘటన ఒకటి జరిగినట్లు చెప్పుకొచ్చారట.అదేమంటే ఈ హాస్పిటల్‌లోని మార్చురీ వద్ద ఉన్న స్ట్రెచర్ ఇలాగే కదిలింది.ఇక ఈ విషయం గాలికంటే వేగంగా పాకడంతో అక్కడి స్థానికులు ఆ హాస్పిటల్‌లో తప్పకుండా దెయ్యాలు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు.మరి,ఎంత వరకు ఇది నిజమనేది,ఈ విషయాన్ని చదివి ఆలోచించే వారి విజ్ఞతకే వదిలేసున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: