రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి అందరికి తెలుసు.  ఇప్పటికే ఈ కంపెనీ అనేక వ్యాపారాల్లో తలమునకలై ఉన్నది.  ఒకటికాదు రెండు కాదు వందలాది బిజినెస్ లు ఈ కంపెనీ చేస్తున్నది.  జియో టెలికంను స్థాపించి తక్కువ ధరకు మొబైల్ డేటా ను అందిస్తూ మిగతా టెలికం సంస్థలకు చెమటలు పుట్టిస్తోంది రిలయన్స్.  ముఖేష్ అంబానీ తన తెలివితేటలతో తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు.  ఇప్పటికే అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.  


త్వరలోనే మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు ముఖేష్ అంబానీ.  అది తనకు బాగా కలిసి వచ్చిన వ్యాపారమే.  ఇప్పటి వరకు చమురుశుద్ధి, పెట్రోల్ రంగాలతో అగ్రగామిగా కొనసాగుతున్న రిలయన్స్ సంస్థ, ఇప్పుడు మరో వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నది.  అదే పెట్రో కెమికల్స్ వ్యాపారం.  జామ్ నగర్లో రిలయన్స్ కు చమురు శుద్ధి కర్మాగారం ఉన్నది. 


ఈ కర్మాగారంలో చమురును శుద్ధి చేసి   వివిధ రకాల ప్రొడక్ట్స్ ను బయటకు తీస్తారు.  అందులో పెట్రోల్, డీజిల్, ఇథనాల్, ఈథర్, తారు  వంటివి ఉంటాయి.  అయితే, వీటిల్లో పెట్రోల్ కు మంచి డిమాండ్ ఉన్నది.  అయితే, భవిష్యత్తులో పెట్రోల్ ఉత్పత్తులు తగ్గిపోయే అవకాశం ఉన్నది.  అలానే ఇతర మార్గాలలో పెట్రోల్ కు బదులుగా వాహనాలు నడిపే విధంగా డెవలప్ చేస్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నాలు సాగుతున్నాయి.  


కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ పెట్రోల్ కు డిమాండ్ తగ్గినా ఆదాయం తగ్గకుండా ఉండేందుకు రిలయన్స్ ప్లాన్ చేసింది.  పెట్రో కెమికల్స్ ను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది.  పెట్రో కెమికల్స్ ద్వారా ఆదాయం మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.  ఇందుకోసం జామ్ నగర్ లోని చమురు శుద్ధి కర్మాగారంలో మార్పులు చేస్తున్నట్టుసమాచారం.  త్వరలోనే దీనికి సంబంధించిన వార్త అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: