కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పనిచేస్తున్నది.  అక్కడి పోలీసులు తీరు కూడా అలానే కనిపిస్తోంది.  వాహన చట్టాన్ని అములు చేస్తున్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు సూచించిన విధంగా జరిమానాలు విధిస్తున్నది.  మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాయి.  అయితే, జరిమానాల విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకొని తగ్గించాయి. తగ్గించిన విధానం ప్రకారమే జరిమానాలు విధిస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.  అక్కడ కొత్త వాహన చట్టంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  ఆలోచనలో ఉన్నామని చెప్తున్నది.  అయితే, వాహన చట్టం అమలులో లేకున్నా అక్కడ పోలీసులు మాత్రం జరిమానాలు భారీగా విధిస్తున్నారు.  ఈ విధింపుతో పాటు కొన్ని కొత్తగా సొంతంగా చట్టాలు చేసి జరిమానాలు వేస్తున్నారు.  ఇందులో భాగంగానే ఇటీవల జైపూర్ లో వెరైటీగా ఓ వ్యక్తికి జరిమానా వేశారు.  


అయితే, ఆ జరిమానా వింతగా ఉన్నది.  లుంగీ కట్టుకొని, చెప్పులు వేసుకొని చొక్కాకు గుండీలు పెట్టుకోకుండా  టాక్సీ నడుపుతున్నాడని చెప్పి ఆపి పోలీసులు అతనికి జరిమానా వేశారు.  చలానా రాసి చేతిలో పెట్టారు.  అయితే, ఎంత కట్టాలి అన్నది మాత్రం అందులో ఇవ్వలేదు.  కోర్టులో సూచించిన మేరకు జరిమానా కట్టాల్సి వస్తుందని చెప్పారు.  దీంతో పాపం ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.  ఎందుకు జరిమానా విధించారో తెలుసుకొని షాక్  కావడం జరిగింది.  ఈ సంఘటన సెప్టెంబర్ 6 న జరిగింది.  


తాము ఇంకా జరిమానాలపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నా.. పోలీసులు మాత్రం కొత్త చట్టం ప్రకారం రూల్స్ ఫాలో అవుతున్నారు.  రోడ్డు సేఫ్టీ ముఖ్యం కాబట్టి, దానికి అనుగుణంగానే తాము ప్రవర్తిస్తామని పోలీసులు చెప్తున్నారు.  ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఎప్పటికో అమలు చేస్తుంటాయి.  ప్రజల సేఫ్టీను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తుంటాయి.  అందుకే పోలీసులు తమ చేతుల్లోకి తీసుకొని అమలు చేస్తున్నట్టున్నారు.  ఇది ఒకందుకు మంచి పద్దతే అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: