ఏపీలో పెట్టుబ‌డులు పెట్టి వ్యాపారులు చేసుకునేందుకు ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు ఉత్సాహం చూపుతున్నార‌ట‌. అందుకు స‌రైన అవ‌కాశాల కోసం పారిశ్రామిక వేత్త‌లు ఎదురు చూస్తుండ‌గా, ఏపీ ఐటీ, వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డితో పలువురు పారిశ్రామిక‌వేత్త‌లు స‌మావేశ‌మై సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం ఇప్పుడు ఏపీకి పారిశ్రామిక వేత్త‌లు క్యూ క‌ట్టేలా ఉన్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌గా అవ‌త‌రించిన ఏపీలో ఇప్పుడు ఐటీ ప‌రిశ్ర‌మ‌లు లేవు. దీనికి తోడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే గ‌త టీడీపీ ప్ర‌భుత్వం కేవ‌లం రాజ‌ధాని అమ‌రావ‌తి పైనే ఫోక‌స్ పెట్టి పారిశ్రామికాభివృద్ధిని, ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌ను విస్మ‌రించింది. దీంతో ఏపీలో ఉన్న నిరుద్యోగుల‌కు, ఐటీ ప్రోఫెష‌న‌ర్ల‌కు ఎలాంటి ప‌నులు లేక ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స పోతున్నారు.


అయితే ఐటీ ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పితే ఏపీలోనే ఐటీ ఎగుమ‌తుల‌కు అవ‌కాశాలు ఏర్ప‌డి ఆర్థికంగా అభివృద్ధి చెంద‌డానికి అవ‌కాశాలు ఉన్నాయి. దీనికి తోడు పారిశ్రామికాభివృద్ధి చేస్తే నిరుద్యోగ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌డంతో పాటు ఆర్థికంగా ఏపీ ఎద‌గ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఏపీలో స్థానికంగా దొరికే ముడిస‌రుకుల‌ను ఉప‌యోగించుకుని అక్క‌డే ఉత్ప‌త్తి కేంద్రాల‌ను నెల‌కొల్పితే స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి.


ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఏపీని పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు స్థానికంగా ఏర్పాటు చేసే ప‌రిశ్ర‌మల్లో, ఏపీలో ఏర్పాటు చేసే సంస్థ‌ల్లో  స్థానికుల‌కే 75శాతం ఉద్యోగాలు అని ప్ర‌కటించారు. అంటే ఏపీలో స్థానికంగా ఏర్పాటు చేసే ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కే ఉద్యోగాలు ద‌క్కుతాయి. అయితే స్థానికుల‌కు ఉద్యోగాలు రావాలంటే ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పేలా ఏపీ సీఎం జ‌గ‌న్ కృషి చేస్తున్నారు. అందుకే ఏపీ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి పారిశ్రామికాభివృద్దికి ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌ల‌లో స‌మావేశాలు జ‌రుపుతూ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. దీనికి తోడు అనంత‌పురం, విశాఖ‌ప‌ట్నం ఐటీ కారిడార్‌గా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.


రాబోవు రోజుల్లో ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌ను , ఐటీ సంస్థ‌లు నెల‌కొల్పెలా చొర‌వ తీసుకుంటున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా సౌకర్యాలు, సేవలందించే పేరున్న హోటల్ హిల్టన్ ప్రతినిధి మంత్రి గౌతంరెడ్డితో  సమావేశమయ్యారు. ఏపీలో హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలను, ఆంధ్రప్రదేశ్ విశిష్ఠతను మంత్రి వారికి వివరించారు. కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఆ సంస్థ ప్రతినిధి మంత్రితో అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో విశ్వ అపెరల్ గార్మెంట్ ఎక్స్ పోర్టర్ సంస్థ ప్రతినిధులు కూడా మంత్రి మేకపాటితో భేటీ అయ్యారు. ఎగుమతులు, వాణిజ్యం తదితర అంశాలపై ఆ సంస్థ ప్రతినిధి మైథిలి మంత్రితో చర్చించారు. వీటికి తోడు  ఏపీలో వాణిజ్య విస్తరణ దిశగా ఐటీ దిగ్గజం టీసీఎస్ సంస్థ ప్రతినిధులు సునీల్ దేశ్ పాండే, నీత మంత్రితో భేటీ అయ్యారు.  వారు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.


అక్టోబజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరిపారు. ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు గల ఇండస్ట్రి, ఐటీ పాలసీ ప్రతిపాదనలపై పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ కూపర్స్) సంస్థ ప్రతినిధులు రాకేశ్, శ్రీరామ్‌లతో సమాలోచనలు చేశారు. ఇలా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టే వారి కోసం వైసీపీ ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తుండ‌గా, రాబోవు రోజుల్లో ఐటీ సంస్థ‌లు, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. సో రాబోవు రోజుల్లో ఐటీ కేంద్రంగా, పరిశ్ర‌మ‌ల‌కు నెలువుగా మార్చేందుకు సీఎం జ‌గ‌న్ తీవ్ర‌మైన కృషి జ‌రుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: