వేణుమాధవ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.  సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఎన్నో బెస్ట్ సినిమాల్లో నటించారు.  పవన్ కళ్యాణ్ కు అత్యంత ఇష్టమైన కమెడియన్స్ లో వేణు మాధవ్ కూడా ఒకరు.  పవన్ తో కలిసి తొలిప్రేమ, తమ్ముడు, బంగారం వంటి సినిమాలు చేశాడు.  తొలిప్రేమ, తమ్ముడు సినిమాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు వేణు మాధవ్.  వేణు మాధవ్ టైమింగ్ కామెడీ అంటే పవన్ కు చాలా ఇష్టం.  ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.  


సినిమాల్లోకి రాకముందు తన జీవితాన్ని ఒక చిన్న ఆఫీస్ గా ప్రారంభించాడు.  అందరు సినిమాపై మక్కువతో సినిమా ఆఫీస్ లో ఆఫీస్ జాయిన్ అవుతుంటారు.  కానీ, వేణు మాధవ్ అలా కాదు.  తనకు ఎంతో ఇష్టమైన నటుడు, రాజకీయ నాయకుడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా చేరిపోయాడు.  అప్పటికి అది చాలు.  ఎన్టీఆర్ ఆఫీస్ లో ఉద్యోగం అంటే అదే గొప్పగా ఫీల్ అయ్యేవాడు.  


ఆఫీస్ బాయ్ గా చేరిన వేణుమాధవ్ కు పరిచయాలు ఏర్పడ్డాయి.  ఆ పరిచయాలే రాజకీయాలవైపు అడుగులు వేయించాయి.  సినిమా రంగంలో అవకాశం వచ్చినా.. సినిమాలు చేసినా.. తాను వచ్చిన రంగాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.  అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.  రాజకీయ నాయకులతో అనుబంధం పెంచుకున్నారు.  తెలుగు దేశం పార్టీకి అవసరమైన సేవను చేశారు. ప్రచారం నిర్వహించారు.  సినిమా రంగంలో ఉండే వ్యక్తుల ప్రచారానికి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి దాన్ని వేణుమాధవ్ మంచిగా ఉపయోగించుకున్నారు.  


ఇలా ఉపయోగించుకున్న వేణు మాధవ్ ఆ తరువాత చంద్రబాబుకు కూడా దగ్గరయ్యారు.  బాబుతో మంచి పరిచయాలు ఉన్నాయి.  వీలు దొరికినప్పుడల్లా బాబుతో తన రాజకీయాల గురించి మాట్లాడేవారట.  2014లో ఎన్నికల్లో పోటీ చేయాలని ట్రై చేశారు.  కానీ, అప్పటికే బీజేపీతో పొత్తు ఉండటంతో కోదాడ నుంచి పోటీ చేసే అవకాశం దొరకలేదు.  అయినా సరే డీలా పడకుండా ప్రచారం చేశారు.  ఆ తరువాత కథ అడ్డం తిరిగింది.  ఆరోగ్యం క్షిణించడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.   సినిమాలకు దూరం అయ్యాడు.  ఇప్పుడు అందరికి దూరం అయ్యి అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు. వేణు మాధవ్ మృతిపట్ల చంద్రబాబు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: