గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను, మహిళలను, బడుగు, బలహీన బిసి వర్గాల మహిళలను ఉద్ధరిస్తామని చెప్పి బిసి మహిళల ఆత్మహత్యలకు కారకులైన వైసీపీ కార్యకర్తలను ఏమనాలో సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ కోరారు.  రాష్ట్రంలో 10 మంది మహిళలు చనిపోతే 6 మంది బీసీ మహిళలే ఉన్నారని అన్నారు. గుమ్మం దగ్గరికి పరిపాలన తీసుకొస్తున్నామని చెప్పి గుమ్మం లోపలికి హత్యా రాజకీయాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. 


తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన మల్లాడి వీరవేణి  అదే గ్రామానికి చెందిన పాలెపు మాధవవర్మ గ్రామ వాలంట్రీ వేధింపులు తాళలేక బిసి మహిళ అయిన వీరవేణి ఆత్మహత్య చేసుకుంది.  90 శాతం మనవాళ్లకే గ్రామ వాలంట్రీ పోస్టులు ఇచ్చామని ఏ-2 ముద్దాయి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకందరికి తెలిసినవే అన్నారు.  మహిళ మరణానికి కారణమైన గ్రామ వాలంట్రీకి సంబంధించి మీరు ఏం సమాధానం చెబుతారు? ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబాపురంలో మత్స్యకార మహిళను వివస్త్రను చేస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుందని అన్నారు. 


దాని గురించి ఇప్పటి వరకు చిన్న సమాధానం కూడా లేదని, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. అచ్చొచ్చిన ఆంబోతులా వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంట్రీలుగా వదిలారు. ఇదేనా పరిపాలన అంటే? దీనికి ఖచ్చితంగా జగన్మోహన్‌రెడ్డికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూడు నెలల నుంచి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్‌రెడ్డి మీడియా ముందుకు రావడానికి మొఖం చాటేస్తున్నారు.  గతంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో 11 మంది గిరిజన మహిళలు అత్యాచారానికి గురైతే గిరిజనుల వైపు నిలబడకుండా అత్యాచారం చేసినవారికి అండగాఉండి కాపాడే ప్రయత్నం రాజశేఖర్‌రెడ్డి చేశారని గుర్తు చేశారు. 


మంత్రి పుష్పశ్రీవాణి గిరిజన మహిళ కాదని గిరిజన సంఘాలన్నీ ఘోషిస్తున్నాయన్నారు. ఈ విషయంగా కోర్టుకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. గిరిజన కులానికి సంబంధంలేని వ్యక్తిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా చేసి జగన్మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది తుగ్లక్‌ పాలన కాకపోతే మరేంటని విమర్శించారు. గ్రామ వాలంట్రీల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ వాలంటీరు దోపిడీ దొంగల్లా మారారన్నారు. 


అత్యాచారాలకు పాల్పడుతున్న గ్రామ వాలంటీర్లను మీరేం చేయదలచుకున్నారో చెప్పాలన్నారు. గ్రామ వాలంటీరు వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రానికి మీరు ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులకు రూ.2 వేలు చొప్పున ఇచ్చి అండగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు కట్టే సొమ్ముతో వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టి వారి వల్లే భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్ర పరిపాలన ఎంత భ్రష్టుపట్టివుందో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బిసి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: