ఎన్నో దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యం ఏదైనా ఉందంటే అది నిరుద్యోగమే. ప్రభుత్వాలు మారిన ఈ నిరుద్యోగ సమస్య మాత్రం తగ్గలేదు. రాను రాను నిరుద్యోగ సమస్య పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఏటా లక్షల మంది గ్రాడ్యుయేట్స్ చదువు పూర్తి చేసుకుని..బయటకు వస్తున్న వారికి తగ్గట్టుగా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు నూటికో కోటికో అన్నట్లుగా దొరుకుతుంటే...ప్రైవేట్ ఉద్యోగాల్లో అనుభవానికి పెద్ద పీఠ వేస్తున్నారు. దీని వల్ల ఫ్రెషర్స్ కు జాబ్స్ రావడం లేదు.


వాళ్ళు రెజ్యూములు పట్టుకుని కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగేలా తిరిగిన ఉద్యోగం రావడం లేదు. అలా తిరగడంలోనే ఏళ్ళు గడిచిపోతున్నాయి. మళ్ళీ చదువు పూర్తి అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే ఏం చేస్తున్నావని ప్రైవేట్ సంస్థలు ప్రశ్నిస్తాయి. ఇలా ఎటు వచ్చిన అనేక రకాలుగా నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణాలు అవుతున్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్న రాష్ట్రం హర్యానా. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి హబ్‌గా గుర్తింపు పొందిన హర్యానా రాష్ట్రంలో ఉద్యోగ కల్పన దారుణంగా పడిపోయింది.


ఈ రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్య ఆగష్టు నెలకు 28.7శాతంగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ తెలిపింది. గత రెండేళ్లలో ఈ సమస్య 1.8శాతం నుంచి 16 రెట్లు పెరిగింది. అయితే నిరుద్యోగ సమస్య అతి తక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఆగష్టునెలలో 0.7శాతం మాత్రమే నిరుద్యోగిత రేటు నమోదైంది. ఐటీకి కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం హబ్‌గా మారడంతో ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే దాదాపు 10 లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారని సంస్థ తెలిపింది.


ఇక కర్ణాటక తర్వాత నిరుద్యోగిత రేటు తక్కువగా గోవాలో ఉంది. తర్వాత మేఘాలయాలో 1.6శాతం, సిక్కింలో 2.1శాతం, తెలంగాణలో 2.4 శాతంకు నిరుద్యోగ రేటు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: