చంద్రబాబునాయుడిపై కక్ష సాధించాలనుకునే క్రమంలో జగన్‌ తనగొయ్యితానే తవ్వుకుం టున్నాడని, రుణమాఫీ కింద గత ప్రభుత్వం విడుదల చేసిన రైతురుణమాఫీ సొమ్ముకి సంబంధించి న జీవో-38ని రద్దు చేయడం ద్వారా రాష్ట్రప్రభుత్వం సరిదిద్దుకోలేని తప్పు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రైతాంగాన్ని రక్షించాలని, వ్యవసాయరంగాన్ని కాపాడాలని భావించిన  నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రూ.24వేల కోట్ల రైతురుణమాఫీ చేయాలని సంకల్పిం చడం జరిగిందన్నారు. 

లోటుబడ్జెట్‌ ఉన్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా అర్హుడైన ప్రతిరైతుకి రూ.లక్షా50వేల వరకు, 5 విడతల్లో పదిశాతం వడ్డీతో కలిపి రుణమాఫీ చేయాలని చంద్రబాబు భావించారన్నారు. అందులోభాగంగా మొదటివిడతలో రూ.7565కోట్లు, రెండోవిడతలో రూ. 3202కోట్లు, మూడోవిడతగా రూ.3357 కోట్లచొప్పున మొత్తం మూడువిడతల్లో రూ.14,124 కోట్లు రైతులఖాతాల్లో జమయ్యేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నిమ్మల తెలిపారు. అదే క్రమంలో 4, 5విడతల రుణమాఫీకోసం రూ.7985 కోట్లను విడుదల చేయడం కూడా జరిగిందన్నారు. 


అందుకోసం బ్యాంకులకు నిధులు మంజూరుచేస్తూ, నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోనెం-38ని రద్దుచేస్తూ, జగన్‌సర్కారు తీసుకున్న నిర్ణయం ఆయనకుశాపంగా మారనుందని ప్రతిపక్ష ఎమ్మెల్యే స్పష్టంచేశారు. అసెంబ్లీలో అడిగినప్పుడు రైతురుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన దానితో తమకు సంబంధం లేదంటూ రైతులకు తీరని అన్యాయం చేస్తోందని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవోనెం -38ని అమలుచేయాలంటూ గతంలో రైతులు, రైతుసంఘాలవారు కోర్టుకు వెళితే, ఆ జీవోను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని కోర్టు కూడా స్పష్టం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను రద్దుచేస్తూ దుర్మార్గానికి ఒడిగట్టిందని రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 


జీవోరద్దు ద్వారా రూ.7980కోట్లను రైతులకు ఎగ్గొట్టడానికి జగన్‌ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. 2014కు ముందు రైతురుణమాఫీ అసాధ్యమన్న జగన్మోహన్‌రెడ్డి, అధికారం లోకి వచ్చాక, రాష్ట్ర రైతాంగానికి దక్కాల్సిన రుణమాఫీ, అన్నదాతాసుఖీభవ నిధులను కాజేసేందు కే జీవో-38ని రద్దు చేశాడని నిమ్మల దుయ్యబట్టారు. అన్నదాతాసుఖీభవ పథకం కింద నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర సాయంగా రూ.9వేలు, కేంద్ర సాయంగా రూ.6వేలు కలిపి, మొత్తం రూ.15వేలు ఇవ్వాలని భావించి, బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించి, రూ.4వేల చొప్పున  రైతుల ఖాతాలకు నిధులుకూడా జమచేయడం జరిగిందన్నారు. 


రైతురుణమాఫీ 4, 5 వాయిదాల సొమ్ము, అన్నదాతాసుఖీభవ కిందవచ్చే రూ.9వేలు కలిపి, ఒక్కోరైతుకి రూ.50వేల వరకు మేలు కలిగేలా తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఒక్కో రైతుకుటుంబానికి  దక్కాల్సిన రూ.50వేలను మింగేసి, రైతుభరోసా పేరుతో రూ.6,500లు ఇచ్చి చేతులు దులుపుకు నే ప్రయత్నం చేస్తున్నాడని నిమ్మల ఆక్షేపించారు. రాష్ట్రరైతాంగానికి రూ.సున్నా వడ్డీకి రుణాలిస్తామ ని, అందుకోసం రూ.4వేల కోట్లు అవసరమవుతాయని చెప్పిన జగన్‌సర్కారు, బడ్జెట్‌లో మాత్రం . అందుకోసం రూ.100 కోట్లే కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 


ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం 5 విడతల్లో రైతురుణమాఫీ చేయాలని భావిస్తే, రైతురుణమాఫీ తెలుగుదేశం హామీ , దానితో తమకేం సంబంధమని వైసీపీనేతలనడం, వారి తెలివితక్కువతనానికి నిదర్శనమని టీడీపీ నేత ఎద్దేవాచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో గతప్రభుత్వాలు ఇవ్వకుండా వదిలేసిన ఫీజురీయింబర్స్‌మెంట్‌, విద్యుత్‌, ఆరోగ్యశ్రీ,  బకాయిలు చెల్లించిన విషయాన్ని జగన్‌ ప్రభుత్వం గుర్తెరగాలన్నారు. రైతుభరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతుల్ని కూడా మోసం చేస్తోందన్న నిమ్మల, ఓపెన్‌ కేటగిరీలో ఉండే కౌలురైతులు రైతుభరోసాకు అనర్హులుగా నిర్ణయిస్తూ, భూమిలేని పేదవాడే నిజమైన కౌలు రైతనే విషయం మర్చిపోయి, కులాలు మతాల ఆధారంగా వారిని గుర్తించడం బాధాకరమన్నారు. 


రైతురుణమాఫీ, అన్నదాత సుఖీభవ సొమ్ముకి సంబంధించిన జీవోను రద్దుచేయడం ద్వారా రైతులు తమ జీవితాలపై విశ్వాసం కోల్పోయేలా, రాష్ట్రంలో మరిన్ని రైతుఆత్మహత్యలు జరిగేలా జగన్‌ ప్రభుత్వం క్షమించరాని నేరం చేసిందని రామానాయుడు స్పష్టంచేశారు.ఇప్పటికే జగన్‌ 100రోజుల పాలనలో 144 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 4, 5 విడతల రైతురుణమాఫీ సొమ్ముకి సంబంధించి ప్రభుత్వం రద్దు చేసిన 38జీవోపై కోర్టుల్లో పోరాటం చేస్తామని, రైతులు, రైతుసంఘాలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహిస్తామని  టీడీపీ శాసనసభ్యుడు తేల్చిచెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: