ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. తమ అభిమాన నటుడి మరణించడంతో వేణుమాధవ్  మంది అభిమానులు విషాదంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే నంబర్ వన్  కమెడియన్ గా పేరొందిన వేణుమాధవ్ చనిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి . ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ లో వేణుమాధవ్ ఆఫీస్ బాయ్ గా  పనిచేశారు... అయితే వేణుమాధవ్ కు సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఓ వైపు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తునే  ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేసేవాడు. 

 

 

 ఆ తర్వాత సినిమాలు కమెడియన్ గా,  మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీ లోకి ప్రవేశించి... అంచలంచెలుగా ఎదిగారు వేణుమాధవ్ . 20 సంవత్సరాల పాటు నెంబర్ వన్ కమెడియన్ గా  కొనసాగారు వేణుమాధవ్. కామెడీలో డిఫరెంట్ స్టైల్ తో చెరగని ముద్ర వేసుకున్నారు వేణుమాధవ్. ఎలాంటి పాత్రలోనైనా తనదైన కామెడీని పండిస్తూ ప్రేక్షకులకు  నవ్వులు పంచే వారు వేణుమాధవ్. 

 

 

 కాగా వేణుమాధవ్ ఆకస్మిక మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన పుట్టిన రోజుకి మూడు రోజుల ముందు వేణుమాధవ్ మరణించడం ఎంతో బాధాకరం అని అభిమానులు తెలుపుతున్నారు. కాగా  వేణుమాధవ్ మృతితో  కొంతమంది ఆయన సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు. కొంతమంది టాలీవుడ్ పెద్దలు  ఆయన మృతికి సంతాపం తెలిపారు. కాగా వేణుమాధవ్ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకునేవారు కాదని ఆయన సన్నిహితులు కొంతమంది తెలిపారు. అయితే ప్రధానంగా రెండు సమస్యలే ఆయన మృతికి కారణమయ్యాయని తెలిపారు . మొదట కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్... ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో నటనకు దూరమయ్యారని తెలిపారు . ఆ తర్వాత వేణుమాధవ్ కు కిడ్నీ సంబంధిత వ్యాధి కూడా రావడంతో పరిస్థితి విషమించి  వేణుమాధవ్ చిన్నవయసులోనే కన్నుమూశారని వేణుమాధవ్ సన్నిహితులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: