రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ధాన్యం కొనుగోలు పెరుగుతూ వస్తోందని ఆయన వివరించారు. 2018-19సంవత్సరానికి గాను 77.41 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. తద్వారా దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో నిలిచిందన్నారు.


ఈసంవత్సరం 92లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కోటి మెటిక్‌టన్నులకు ఈ టార్గెట్ చేరవచ్చట. 2019-20 ఖరీఫ్‌ కార్యాచరణపై మంత్రి గంగుల కమలాకర్.. ఎంసీహెచ్‌ఆర్‌డిలో జాయింట్‌కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.


ఖరీఫ్‌ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారికి కనీస మద్దతుధర లభించేలా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలుతీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గతేడాదికంటే ఈసారి 10 నుంచి 15 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఉత్పత్తి అధింగా వస్తుందని మంత్రి అంచనాలు తెలిపారు.


కొంతకాలంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి గణాంకాలను మంత్రి వివరించారు. దీని ప్రకారం.. గత సంవత్సరం ఖరీఫ్‌లో 10.86 లక్షలహెక్టార్లలో వరిసాగు అయ్యింది. దీని ద్వారా 40.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. ఈ ఖరీఫ్‌లో 11.38 లక్షల హెక్టార్లలో వరిసాగైంది. దీని ద్వారా 55 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం. ఈఏడాది తెలంగాణ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీఫ్‌లో 55 లక్షల మెట్రిక్‌టన్నులు, రబీలో 37 లక్షల మెట్రిక్‌టన్నులు సేకరించాలని నిర్ణయించింది. లక్ష్యం కంటే ధాన్యం ఎక్కువ మార్కెట్‌కు వచ్చినా కొనుగోలుచేసేలా ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: