కాలం మారిపోతోంది.. ఇప్పటి తరానికి అన్నింటికీ తొందరే.. ఎక్కువగా పెద్దవాళ్లు ఇలాంటి మాటలు అంటుంటారు. కొందరు పిల్లలు కూడా వాటిని నిజం చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజర్లు ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి, సెక్స్ వంటి విషయాల్లో సరైన అవగాహన లేక తొందరపడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.


అలాంటి సంఘటనే హైదరాబాద్ లోని పాత బస్తీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఫలక్‌నుమా పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ బాలిక ఓ పాఠశాలలో పదో తరగతి చదవువుతోంది. వయస్సు 16 సంవత్సరాలు.. వయస్సు ప్రభావమో.. సినిమాల ప్రభావమో ఏమో కానీ.. ఆ అమ్మాయి ఓ యువకుడి ప్రేమలో పడింది. అంతే కాదు.. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఆ విషయాన్నే ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ కుర్రవాడితో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులుకు చెప్పింది.


పదో తరగతి చదివే అమ్మాయి ఏకంగా తనకు ఫలానా కుర్రాడితో పెళ్లి చేయాలని అడిగే సరికి మొదట తల్లిదండ్రులు షాకయ్యారు. ఆ తర్వాత అంతా వయస్సు ప్రభావం అనుకుని.. సరే అలాగే చేస్తాం.. కానీ నీ వయస్సు పదహారే.. కనీసం 18 ఏళ్లు రావాలి పెళ్లికి.. అప్పటి వరకూ బుద్దిగా చదువుకో అని నచ్చజెప్పారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ప్రేమ మత్తు నుంచి బయటపడలేదు..


ఆ బాలిక ఏకంగా పెళ్లిళ్లు చేసే ఖాజీనే ఆశ్రయించింది. ఈనెల 20వ తేదీన ఓ మధ్యవర్తి ద్వారా బాలిక ఖాజీని సంప్రదించింది. ఆ ఖాజీ కూడా నువ్వు మైనర్‌ వి అని చెప్పి.. మేజర్ వి అయ్యాక రా పెళ్లి చేస్తానని చెప్పి పంపంపించారు. రెండేళ్లు ఆగితే పెళ్లి చేస్తామని కుటుంబ సభ్యులు కూడా మరోసారి తెలిపారు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెందింది. రెండేళ్ల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో.. తనకు నచ్చిన యువకునితో పెళ్లి అవుతుందో లేదోనని బెంగ పెట్టుకుంది. ఆ బెంగతోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని సుసైడ్ నోట్ లో తెలిపింది. సారీ డాడీ.. సారీ మమ్మీ అంటూ లేఖ రాసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: