తెలుగుదేశంపార్టీ నేత,  వివాదాస్పద మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ బెయిల్ మీద బయటకు రావటం కష్టమేనా ? అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఎస్సీ వేధింపుల కేసులో అరెస్టయిన చింతమనేని రిమాండ్ ఈరోజుతో ముగుస్తుంది. అంటే రోజో లేకపోతే రేపో బెయిల్ పై బయటకు వచ్చేస్తాడని అనుకున్నారు.

 

కానీ మరో రెండు కేసులపై వారెంటుతో చింతమనేనిని పోలీసులు  మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. రెండు కేసులను విచారించిన న్యాయమూర్తి చింతమనేనికి రెండు కేసుల్లో కలిపి అక్టోబర్ 10వ తేదీ వరకూ రిమాండ్ విధించటం చర్చనీయాంశమైంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చింతమనేనికి ఇప్పట్లో బెయిల్ దొరకటం కష్టమనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

 

టిడిపి హయాంలో ఆకాశమే హద్దుగా చింతమనేని చెలరేగిపోయారు. మొదటి నుండి ఆయన వైఖరి తీవ్ర వివాదాస్పదంగానే ఉంది. ఎవరిని పడితే వారిని నోటికొచ్చినట్లు తిట్టడం, దాడి చేసి కొట్టడం లాంటివి చింతమనేనికి చాలా సహజమైపోయింది. చింతమనేనిపై సుమారు 60 కేసులు నమోదయ్యాయంటేనే ఆయన నేపధ్యం ఎంత భయంకరమైనదో అర్ధమైపోతోంది.

 

మొదటిసారి గెలిచినపుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రెండోసారి గెలిచినపుడు తెలుగుదేశంపార్టీనే అధికారంలో ఉంది కాబట్టి చింతమనేని ఆటలు సాగిపోయాయి. బాధితులు తనపై కేసులు పెట్టారని తెలియగానే వెంటనే బాధితులను పట్టుకుని బాదేయటం చింతమనేనికి అలవాటుగా మారిపోయింది. ఎవరైనా బాధితులు పోలీసు స్టేషన్ కు రాగానే వెంటనే అదే విషయాన్ని పోలీసులే చింతమనేనికి చెప్పేసేవారు.

 

ఆ విషయం బయటకు పొక్కటంతో చింతమనేనిపై ఫిర్యాదు చేయాలంటేనే బాధితులు భయపడిపోయారు. చింతమనేని అరాచకాలు ఈ స్ధాయికి చేరుకున్నాయంటే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలి.  ఎప్పుడైతే చంద్రబాబు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యారో అప్పటి నుండే చింతమనేనికి కష్టాలు మొదలయ్యాయి. బాధితులు ఒక్కసారిగా పోలీసు స్టేషన్లపై పడి ఫిర్యాదులు మొదలుపెట్టారు. దానికి తోడు పోలీసులు కూడా కేసులు పెట్టటంతో చింతమనేని అరెస్టు అనివార్యమైంది. చేసిన పాపాలు ఊరికేపోతాయా ? అందుకనే ఓ కేసులో ఇపుడు చింతమనేని రిమాండ్  అనుభవిస్తున్నారు. చింతమనేనిపై కేసులు ఎప్పుడు క్లియరవుతాయో ? ఎప్పుడు బయటకు వస్తారో ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: