ఉద్యోగం మనకు జీతాన్ని ఇవ్వడమే కాదు.. జీవితానికి ఒక భరోసాను ఇస్తుంది.  ముదిమి వయసులో ఆసరాగా ఉపయోగపడుతుంది.  అందుకే ఉద్యోగం సంపాదించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు.  ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా.  ఇప్పుడంటే ఐటి అభివృద్ధి చెందింది కాబట్టి నెలకు లక్షలాది రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు దొరుకుతున్నాయి.  అదే ముప్పై సంవత్సరాల క్రితం ఇలాంటి ఉద్యోగాలు ఎక్కడున్నాయి.. 


ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని జీవనాన్ని లాక్కోస్తుంటారు.  అందుకే అప్పటి జీవితాలు అనంత మాత్రంగానే ఉండేవి.  30 ఏళ్ల క్రితం చిన్నరాజుకుప్పానికి చెందిన ఎం మునుస్వామి అనే వ్యక్తి పుత్తూరులో ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ కళాశాలలో అటెండర్ గా జాయిన్ అయ్యారు.  అది కాంట్రాక్టు బేస్ లో అటెండర్ గా జాయిన్ అయ్యారు.  అలా జాయిన్ అయిన మునుస్వామికి 15 సంవత్సరాల క్రితం పేర్మినెంట్ చేస్తూ ప్రిన్సిపాల్ నిర్ణయం తీసుకున్నారు.  


కానీ, ప్రిన్సిపాల్ నిర్ణయాన్ని అప్పటి అడిట్ అధికారులు వ్యతిరేకించారు.  పేర్మినెంట్ చేస్తూ నిర్ణయం తీసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు.  చిన్న ఉద్యోగం అది కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగం చాలీచాలని జీతంతో రిటైర్ అయ్యే వరకు లాక్కొచ్చారు.  రిటైర్ అయ్యే సమయానికి చాలా అప్పులు మిగిలాయి.  రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి కదా వాటితో అప్పులు తీర్చుకోవాలని అనుకున్నాడు మునుస్వామి.  


మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది అనే లెక్కన.. నాలుగు సంవత్సరాలు చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగాడు.  పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నారు.  డబ్బు ఇస్తే.. అప్పులు తీర్చి.. వారి పెళ్లిళ్లు చేయాలని మొరపెట్టుకున్నాడు. అయన మొరను ఎవరు పట్టించుకోలేదు.  తిరిగి తిరిగి అలసిపోయిన ఆ అటెండర్.. తాను పనిచేసిన కాలేజీ భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  పనిచేసిన చోటే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోవడం అందరిని బాధించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: