ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ఏపి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.  గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా బాక్సైట్ తవ్వకాలు జరిగాయని..దాని వల్ల పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉన్నా అప్పటి ప్రభుత్వం ఏదీ ఖాతరు చేయలని అధికార పార్టీ పేర్కొంది. 

కాగా,  ఎన్నిల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీని నేడు నెరవేర్చారు. రెండేళ్ల కిందట బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని సీఎం ప్రకట. బాక్సైట్ తవ్వకాల అనుమతి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. 30 ఏళ్లపాటు ఏపి ఎండీసీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో అరకు మండలం  గాలికొండ, చిత్తమగొండి, రక్తకొండ, చింతపల్లి ఫారెసక్ట్ లో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.  2,226 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాల అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: