ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడుతున్నాయి. కొన్నిచోట్ల కావాల్సినంత మోతాదులో వరుణుడు కరుణిస్తుండగా... మరికొన్ని చోట్ల, అయితే అతివృష్టి లేక పోతే అనావృష్టి అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. దీనికి తోడు మన అధికారుల నిర్లక్ష్యం మరియు చేతగానితనం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ సంవత్సరం విచిత్రం ఏమిటంటే ఎప్పుడూ భారీగా వర్షాలు పడే కోస్తా కాకుండా ఈసారి రాయలసీమలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కడప మరియు కర్నూలు జిల్లాలో ప్రజలు భారీ వర్షాలతో కొన్ని ఇబ్బందులకు గురి కాగా తాజాగా సీమ లో మరొక జిల్లాని వర్షం ఊపేసింది.

అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి నుంచి పలుచోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కేవలం ధర్మవరంలోనే 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇకపోతే జిల్లా అంతటా కలిసి  సుమారుగా 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అంకెలు అంత పెద్దవిగా కనపడకపోయినా అనంతపురం లాంటి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి వచ్చి భారీగా ఆస్తి నష్టం చేసేందుకు ఇది చాలా ఎక్కువ. ఇకపోతే వర్షం ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురుచూసిన రైతన్నల పంటలు కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి.

గుత్తి, రాయదుర్గం, పామిడి, గుంతకల్లు మండలాల్లో అయితే వర్షపాతం భారీగా నమోదయింది. తాడిపత్రిలో కొన్నిచోట్ల కప్పల వర్షం కూడా కురిసినట్టు సమాచారం. ఒక గుంతకల్లులో రైల్వే స్టేషన్ లో పట్టాల మునిగిపోయే అంతగా నీళ్లు రావడంతో కొన్ని రైళ్లు కూడా రద్దయ్యాయి. రానున్న రోజుల్లో కూడా వర్షపాతం ఇలాగే నమోదయితే ఆర్థిక నష్టం మరియు ప్రాణ నష్టం కూడా భారీగా వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా లాంటి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తరలించేందుకు సరైన సన్నాహాలు చేయడంలో అధికారులు విఫలం అవడంతో ప్రజలు భారీగా నష్టాన్ని భరించాల్సి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: