అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు.  ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తులుగాని ప్రజలను కాల్చుకుతినే వ్యక్తులు కాదని అర్ధం అర్ధం చేసుకోవాలి.  కానీ, నేటి సమాజంలో చాలామంది వ్యక్తులు అర్ధంపర్ధంలేని విధంగా కాల్చుకు తింటున్నారు.  ఇటీవలే ఓ వ్యక్తిని తన అధికారం ఉపయోగించుకొని హింసించాలని చూశాడు.  నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిపై ప్రతాపం చూపాలని అనుకున్నాడు.  


కానీ చివరకు అతని ఉద్యోగమే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  ఎందుకంటే ఇగో.. అధికార దర్పం.. ఇది ఉన్నాయి కాబట్టే చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.  జీవితాలను పాడుచేసుకుంటున్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని తల్కటోరా ఎస్సై దినేశ్ చంద్ర సమీపంలోని బాగా పేరున్న ఫాస్ట్‌ పుడ్ సెంటర్‌కు వెళ్లాడు. తనతో పాటు తన స్నేహితులను కూడా తీసుకువెళ్లాడు. ఫుడ్ వ్యాన్ ఓనర్‌ కన్నయ్య లాల్‌ కు ఆర్డర్ చెప్పాడు. అయితే కొద్దిసేపు వేచి ఉండాలని కన్నయ్య చెప్పాడు. అయితే 15 నిమిషాలైనా ఆర్డర్ రాకపోవడంతో ఆగ్రహానికి గురైన దినేశ్ చంద్ర.. స్నేహితులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  


వ్యాపారం బిజీ కారణంగా ఆలస్యం అయ్యి ఉంటుంది. అని అలోచించి ఉన్నట్టయితే వేరేలా ఉండేది.  కానీ, ఒంటిపై వేసుకున్న ఖాకీ యూనిఫారం దర్పంతో ఆ వ్యాన్ పై పగ పగపెంచుకున్నాడు.  ఎలాగైనా సరే అతని వ్యాపారాన్ని సాగనివ్వకూడదు అనుకున్నాడు.  అనుకున్నట్టుగా ఓ రోజు వ్యాపారం ముగించుకొని తిరిగి వస్తున్న ఫుడ్ వ్యాన్ ను ఆపాడు.  బండికి సంబంధించిన పత్రాలు చూపించమంటే అన్ని చూపించారు.  


అయితే, సీటు బెల్టు పెట్టుకోలేదని చెప్పి.. చలానా రాశాడు.  అలా రాసి వదిలేస్తే ఉద్యోగ ధర్మం అయ్యేది.  పర్సనల్ గా తీసుకొని, వ్యాపారాన్ని సాగనివ్వనని, తనకు ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి వ్యాపారం జరగకుండా చూస్తానని అన్నాడు.  ఇదే ఆ ఎస్సై పాలిట శాపంగా మారింది.  వ్యాన్ లో కూర్చొని ఉన్న ఆ వ్యాపారి కూతురు ఆ దృశ్యాలను వీడియోగా తీసింది.  దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  అవినీతి ఎస్సై బాగోతం అనే విధంగా వీడియో పాపులర్ అయ్యింది.  ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  ఇంకేముంది.. పాపం ఆ ఎస్సై ఉద్యోగం కాస్త ఊడిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: