గోదార‌మ్మ తీరంలో పాపికొండ‌ల‌కు  67 మందికిపైగా విహార‌యాత్ర‌కు వెళ్తున్న బోటు మునిగి 38 మందికిపైగా ప్రాణాలు పోయిన విష‌యం తెలిసిందే. అయితే ఇంకొన్ని మృత‌దేహాల ఆచూకీ దొర‌కాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో ఈప్ర‌మాదం చోటు చేసుకుంది. అయితే ప్ర‌మాదం జ‌రిగిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌ర‌కు బోటును బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోతున్నారు. దాదాపు 315 అడుగుల లోతులో బోటు ఉంద‌ని అధికారులు గుర్తించారు. అయితే ఆ బోటును బ‌య‌ట‌కు తీసేందుకు ఎన్డీఆర్ ఎఫ్‌, తమిళ‌నాడుకు చెందిన ప్ర‌త్యేక సిబ్బంది సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని బోటును తీసే ప్ర‌య‌త్నాలు కొన‌సాగించారు. కానీ బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు, ఇసుక దిబ్బ‌లు, వ‌ర్షం, గాలి ఉండ‌టంతో బోటు తీయ‌డానికి వీలు ప‌డ‌టం లేదు. ఇక్క‌డికి వెళ్లిన వారు కూడా వెన‌క్కి వ‌చ్చేశారు. 

Related image

రెండు గంట‌ల్లోనే మునిగిన బోటును త‌స్తా:
అయితే ఓ వ్య‌క్తి మాత్రం తాను రెండు గంట‌ల్లో బోట‌ను బ‌య‌ట తీసుకువ‌స్తాన‌ని ఛాలెంజ్ చేస్తున్నాడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన వెంక‌ట శివ అనే వ్య‌క్తి అధికారుల‌ను క‌లిశాడు. త‌న‌కు ఓ అవ‌కాశం ఇవ్వండ‌ని, ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కూడా తాను సాయం చేశాన‌ని చెప్పాడు. ఆ రోజు నేవీ అధికారుల‌తో క‌లిసి బోటు మునిగిన ప్రాంతంలో శ‌వాల‌ను బ‌య‌టకు తీసేందుకు సాయ‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చాడు వెంక‌ట శివ‌. అయితే త‌న‌కు ఓ అవ‌కాశం ఇవ్వాల‌ని, అందుకు సంబంధించిన ఎవ‌రి సాయం అవ‌స‌రం లేద‌ని, తాను, త‌న సోద‌రుడు బాబి, మ‌రో ఏడుగురు స్థానికుల‌తో క‌లిసి మొత్తం 9 మందితో రెండుగంట‌ల్లోపే  బోటును బ‌య‌ట‌కు తీసుకుస్తామ‌ని, ఆ అవ‌కాశం త‌న‌కివ్వండ‌ని కోరుతున్నాడు వెంక‌ట శివ‌. ఈ సంద‌ర్భంగా తాను రూ.100 స్టాంప్ పేప‌ర్ మీద రాసిస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు. అయితే త‌న‌కు ఏదైన ప్రాణ హాని జ‌రుతుందోమేన‌ని అధికారులు, పోలీసులు భావిస్తున్నార‌ని, త‌న‌కు ఏమి జ‌ర‌గ‌ద‌ని, తాము ఆ గోదావ‌రి త‌ల్లితో ఆడుకుంటామ‌ని, త‌మ‌ను ఏమి చేయ‌ద‌ని ధీమాగా చెబుతున్నాడు.  అయితే ఉన్న‌తాధికారులను బోటు యాజ‌మాన్యం త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడ‌ని ఆరోపించారు. 

Related image

వార‌ణాశిలో 530 అడుగుల లోతులో ఉన్న బోటును తీశా: వెంక‌ట శివ‌
ఇలా మునిగిపోయిన బోటు తీయ‌డం త‌న‌కు కొత్తేమి కాద‌ని వెంక‌ట శివ చెబుతున్నాడు. వార‌ణాశిలో 530 అడుగుల లోతులో ఉన్న‌బోటును తీశాన‌ని  చెబుతున్నాడు. అలాగే 2005 సంవ‌త్స‌రంలో న‌ల్గొండ జిల్లా వ‌లిగొండ వ‌ద్ద జ‌రిగిన డెల్టా ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాద స‌మ‌యంలో తాను కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలు పంచుకున్నాన‌ని పేర్కొన్నాడు. ఇలా ఎన్నో స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాన‌ని వివ‌రించాడు శివ‌.  త‌న‌కు ఆపద్భాందవుడు, ప్రజారక్షకుడు, సాహసవీరుడు, రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డు కూడా వచ్చిందని పేర్కొన్నాడు వెంక‌ట శివ‌.


మరింత సమాచారం తెలుసుకోండి: