ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకు వస్తున్న అభివృద్ది పథకాలు..తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని..ఓర్వలేక లేని పోని అభాండాలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కన్నబాబు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదేళ్లలో గత ప్రభుత్వం రుణ మాఫీ ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 

రైతులంటే తెగ ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు రుణమాఫి విషయంలో చర్చలకు సిద్దంగా ఉన్నారా అని ప్రశ్నించారు.  రుణమాఫీ విషయంలో రాజకీయం చేయడం మీకు అలవాటు..మీది రైతు ప్రేమ కాదు రాజకీయ ప్రేమ అన్నారు. మీరు మేనిఫెస్టోను కూడా అమలు చేయలేదు. ఓటాన్ అకౌంట్ లో ఎందుకు నిధులు కేటాయించలేదు? కమిటీల పేరుతో రైతుల్లో చంద్రబాబు కోతలు విధించారు.

కేవలం ఆయన హయాంలో రూ.15 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. గత ఐదేళ్లలో ఎందుకు రుణమాఫీ చేయలేక పోయారని ప్రశ్నించారు. సీఎం జగన్ పరిపాలనపై అప్పుడే విషం చిమ్ముతున్న ప్రతిపక్షం ముందు ముందు ఇంకా  ఎన్ని ప్రయత్నాలు చేస్తారో అని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆయన కుటిల రాజకీయాలు మానుకొని అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తే మంచిదన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: