డబ్బు అవసరాలకు తగినంతగా అందుబాటులోకి రాకపోవటమే "ఆర్ధికమంద గమనం" అనే దానికి నాంది మాత్రమే కాదు ప్రస్థావన కూడా!  అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు - డిమాండ్ బాగా తగ్గి వస్తువులు అమ్మకాలులేక - గిడ్డంగుల్లో పేరుకు పోయినప్పుడు - సేవలు అందుబాటు లోకి  రానప్పుడు వినియోగదారుల్లో అనిశ్చితి గాని భయంగాని  కలవరంగాని ఏర్పడి అస్థిరత్వం ప్రబలి - "ఖర్చుపెట్టే" ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొనటమే - ఆర్ధిక వాహినుల్లో ధనప్రవాహం తగ్గిపోవటానికి కారణమై - ఆర్ధిక మందగమనానికి దారి తీస్తుంది.

 

ఉద్యోగుల వ్యాపారుల సంపాదన తగ్గినప్పుడు, వ్యవసాయం నుండి ఫలసాయం అందనప్పుడు, పారిశ్రామికోత్పత్తి ప్రయోజనాలను ఇవ్వనప్పుడు, పరిశ్రమలు మూతపడి ఉత్పత్తులు పూర్తిగా ఆగిపోయినప్పుడు నిరుద్యోగం అవధులు దాటినప్పుడు ప్రజల్లో అంటే కొంత కలవరం చెలరేగి ఆర్ధిక రంగం “స్టాండ్ స్టిల్ అయి స్టాగ్నేట్” అవుతుంది.

 

ఇలాంటి సందర్బాల్లో ఆర్బీఐ చేతిలో ఉన్న ఆయుదాల్లో ఒకదాన్ని గాని లేదా కొన్నింటిని గాని ప్రయోగించటం ఆనవాయితి. అందులో ఒకటి బాంకుల సి.ఆర్. ఆర్ సడలించి ఆర్ధికరంగంలో ధనప్రవాహం పెంచటం తద్వారా పరిశ్రమలకు, వ్యవసాయానికి, విఫణి రంగాలకు ఊతం యివ్వటం ఒక పద్దతి. ఎస్.ఎల్.ఆర్ సడలించి బాంక్ వడ్డీలు తగ్గించి ఋణ సౌకర్యాన్ని సరళ తరం చేసి ధన ప్రవాహాన్ని పెంచి ఆర్ధికరంగాన్ని పరుగులెత్తించటం మరో పద్దతి.

 

ఇంకో పద్దతి ప్రభుత్వం ఉద్దీపన లేదా ప్రోత్సాహకం అనే పేర్లతో దేశ ఆర్ధికనాళాల్లోకి అంటే పరిశ్రమలు, వ్యాపారం, విఫణి, వ్యవసాయం మొదలైనవి వాటితో ధన సరపరా పెంచటం.

 

వీటితో వస్తూత్పత్తికి మూలధనం నిరుద్యోగులకు ఉద్యోగాలు వ్యవసాయదారులకు సాయందొరికి కొనగోలుపై వినియోగదారులకు ఇష్టం ఏర్పడుతుంది. ఈ కొనగోలు శక్తే ఆర్ధిక రంగాన్ని స్టిములేట్ చేస్తుంది. ఇంకేం ఆర్ధిక మందగమనం తొలగి ఆర్ధికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది.

 

ఈ సూత్రమే అమలు చేసి ఇటీవల మన అర్ధిక శాఖామాత్యులవారు అదే నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో సెన్సెక్స్ ను 2000 పాయింట్లతో పరుగులు పెట్టింది.    

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: