ఒక సంస్థ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఆ సంస్థలో ఉండే ఉద్యోగులను సక్రమంగా చూసుకుంటే తప్పకుండా ఆ సంస్థ డెవలప్ అవుతుంది.  ఆ సంస్థ కోసం అహర్నిశలు ఉద్యోగులు పనిచేస్తారు.  అలా కాకుండా ఉద్యోగులను పెద్దగా పట్టించుకోకుండా.. నువ్వు కాకపొతే ఇంకొకరు అనే విధంగా ప్రవర్తిస్తే.. ఉద్యోగులు కూడా అలాగే పనిచేస్తారు.  ఫలితంగా మిగిలేది శూన్యమే.  ఆ ఎందుకులే నెలకు జీతం ఇస్తున్నారు దానికి మనం పనిచేస్తున్నాము అంటే అని పనిచేస్తారు.  


అలా కాకుండా ఉద్యోగులను బాగా చూసుకుంటూ వాళ్లకు తగిన విధంగా జీతాలు ఇస్తే.. మరో ఉద్యోగం చూసుకోకుండా ఆ సంస్థ కోసమే పనిచేస్తారు.  సంస్థను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు.  కొన్ని సంస్థలు ఉంటాయి.  అవి వెంటనే బాగా పైకి వస్తుంటాయి.  అందులో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. అంతేకాదు వర్క్ ఉంటె ఇంకాస్త ఎక్కువగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు.  అలాంటి సంస్థల్లో జాబ్ రావడం అంటే జీవితానికి భరోసా ఉన్నట్టే లెక్క.  


అలాంటి కంపెనీల్లో ఒకటి చార్జెల్‌ ప్రో .  ఇది క్రెడిట్ కార్డుల ప్రాసెసింగ్ సంస్థ.  ఈ సంస్థ గ్రావిటీ పేమెంట్ అనే సంస్థను టేకోవర్ చేసుకుంది.  అందులో ఉన్న ఉద్యోగులంతా చార్జెల్‌ప్రో  సంస్థల్లోకి బదిలీ అయ్యారు.  అలా బదిలీ అయిన ఉద్యోగులను ఒక్కొక్కరిగా ఆ కంపెనీ సీఈవో డ్యాన్ ప్రెస్ పిలిచి అభినందనలు తెలిపాడు.  అంతేకాదు.. ఒక్కొక్కరికి సంవత్సరానికి జీతాన్ని 7 లక్షల రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారట.  


అంటే ఒక్కొక్కరి జీతం సంవత్సరానికి రూ. 7 లక్షల జీతం పెరిగింది.  ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.  గతంలో ఈ సీఈవో మిలియన్ డాలర్ల సంపాదన ఉండేది.  తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కేవలం 30వేల డాలర్లు మాత్రమే జీతంగా ఉండేదట.  చాలీ చాలని జీతంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు జీవితాన్ని లీడ్ చేయడనికి ఒకటికి రెండు ఉద్యోగాలు చేసేవారట.  ఇది గమనించిన ఆ సీఈవో.. ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచారు.  పెంచడమే కాదు.. తన జీతాన్ని తనదగ్గర పనిచేసే ఉద్యోగుల కంటే తక్కువ తీసుకుంటున్నారట.  ఇలాంటి వ్యక్తులు మన ఇండియాలో కూడా ఉంటె.. ఆయా కంపెనీలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి.     


మరింత సమాచారం తెలుసుకోండి: