అక్క చెల్లెల్లు అంటే ఎలా ఉంటారు.. అన్యోన్యంగా ఉండాలి.. ప్రేమగా ఉండాలి.. ఒకరినొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ జీవితంలో ఎదగాలి.. అక్కను చెల్లి, చెల్లిని అక్క ప్రోత్సహించుకుంటూ ఉండాలి.  అలా చేసినపుడు జీవితంలో ఎదుగుతారు.  అలా కాకుండా.. ఈర్షతో ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటె జీవితంలో ఎదగడం పక్కన పెడితే జీవితంలో ఓడిపోవడం ఖాయం అని చెప్పొచ్చు. అంతేకాదు, ఒక్కోసారి జీవితాన్ని కోల్పోడం ఖాయం.  


తన చెల్లులు అందంగా ఉందని, తనకన్నా జీవితంలో రాణిస్తూ.. ఎదుగుతుందని చెప్పి ఓ యువతి తన చెల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది.  హత్య చేసేముందు దారుణంగా చెల్లెలు కళ్ళు పీకి, చెవులు కోసి క్రూరంగా పొడిచి చంపింది.  ఎందుకు అలా చేసింది అంటే తనకంటే అందంగా ఉన్నందుకు అలా చేసినట్టు చెప్పింది.  జీవితంలో తనకంటే బాగా ఎదుగుతుంది అనే కోపంలో అలా చేసిందట. అసలు దీన్ని ఏమనాలి.. పిచ్చి అనాలా లేదంటే మరేమనాలో అర్ధంగాని విషయం.  


ఈ సంఘటన రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఈ సంఘటన జరిగింది.  17 ఏళ్లకే స్టెఫానియా సూపర్ మోడల్ గా ఎదిగింది.  టీవీ ఛానల్స్ లో, పేపర్లో ఎక్కడ చూసినా ఆమె గురించే పేర్లు.. ఇది ఆమె అక్క ఎలిజావేట కు నచ్చలేదు.  అక్కను మించి ఎదగడానికి ఆమె అందమే కారణం అని అక్క నమ్మింది.  రోజు రోజుకు ఆమె చెల్లిపై పగను పెంచుకుంది.  ఓసారి ఎలాగైనా ఆమెను చంపాలని చూసింది.  అనుకున్నట్టుగా చెల్లిని పధకం వేసి చంపేసింది.  


ఎలా చంపింది అంటే.. చెల్లి అలిసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నది.  ఆ సమయంలో అక్క పదునైన కత్తితో పొడిచింది.   ఆ తరువాత కళ్ళు పీకేసింది.  చెవులు కోసేసింది.  ఆ తరువాత దారుణంగా పొడిచేసింది.  189 కత్తిపోట్లు పొడిచింది.  అనంతరం చెల్లి డెడ్ బాడీని తీసుకొని చెల్లి బాయ్ ఫ్రెండ్ అలెక్సీ ఇంటి దగ్గర పడేసింది.  ఆ సమయంలో అలెక్సీ అక్కడ లేదు.  బయట నుంచి వచ్చిన అలెక్సీ అక్కడి దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.  అక్కను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.  కానీ తనకు ఏం తెలియదని బుకాయించింది.  అయితే, పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది.  దీంతో కోర్టు ఆమెకు 25 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: