ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు మరోమాట ఆలోచించకుండా చేయాలి.  అలా చేస్తేనే ఆ పని మంచిగా అవుతుంది. అలా కాకుండా పక్కన పెట్టి పనులు చేయకుండా వదిలేస్తే.. మంచి తరువాత సంగతి చెడు జరుగుతుంది.  మనిషికి చెడు జరిగితే ఎలాగోలా సర్దుకోవచ్చు.  కానీ, పర్యావరణానికి చెడు జరిగితే మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది.  దాని వలన కలిగే అనర్ధాలు అన్ని ఇన్ని కావు.  ఇక ప్రపంచంలో విస్తరణ, అభివృద్ధి పేరుతో అడవులను ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నారు.  


ఇలా నరకడం వలన వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి.  ఈ నష్టాల వలన వచ్చే ఇబ్బందులు కూడా అలానే ఉంటాయి. అడవులను నరికేయడం వలన భూతాపం పెరుగుతుంది.  అకాలంగా వర్షాలు కురవడం, వరదలు రావడం వంటివి వస్తుంటాయి.  ఇలా వరదలు రావడం వలన ప్రజా జీవనం అస్తవ్యస్తం అవుతుంది.  ప్రజాజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు ...ఇబ్బందులు కూడా అలానే వస్తుంటాయి.  వీటిని నివారించేందుకు వీటిపై అవగాహనా కల్పించేందుకు, అడవులను రక్షించుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన స్టాంటన్ కూక్ అనే వ్యక్తి తన పద్దతిలో అడవులను కాపాడినందుకు రైన్ ఫారెస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు.  అది ఇప్పుడు కాదు.. 2011లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.  


ఇందులో భాగంగా ఈ వ్యక్తి అరగుండు.. అరమీసంతో ఆస్టేలియా వీధుల్లో తిరుగుతున్నాడు.  మీదట అందరు అతడిని చూసి ఫ్యాషన్ అనుకున్నారు.  కొంతమంది అదేంటి అలా చేస్తున్నాడు.  ఏమైనా పిచ్చా అనుకున్నారు.  ఇంకొందరు మాత్రం రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.  కానీ, ఆ వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు.  తనను అడిగిన వ్యక్తులకు అడవుల సంరక్షణ కోసం, రైన్ ఫారెస్ట్ లను రక్షించుకోవడం కోసం ఇలా చేస్తున్నట్టు తెలిపాడు.  


దీనికోసం విరాళాలను కూడా సేకరిస్తున్నారు.  వచ్చిన విరాళలో 95% విరాళాలను అమెజాన్ అడవుల సంరక్షణ కోసం వినియోగిస్తుంటారు.  రైన్ ఫారెస్ట్ లను సంరక్షించుకుంటే.. దాని వలన భూతాపం పెరగదని... భూమి అన్ని విధాలుగా రక్షించబడుతుందని అంటున్నాడు.  అన్ని విధాలుగా రక్షించబడాలి అంటే.. దాని కోసం పనిచేయాలి.  అందరూ కలిసి కట్టుగా పనిచేసి అడవులను రక్షించుకుంటే..పర్యావరణం నుంచి బయటపడొచ్చు. లేదంటే భూమి అంతంకాక తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: