సామాన్యుని జేబులో డబ్బులేదు. అలాగే సమాజంలో ప్రభుత్వం విదిలించక పోతే డబ్బులేనట్లే. అంతా ఒక వలయం. వినియోగదారుడు వస్తు సేవలకు వెచ్చిస్తే సమాజంలో వస్తువులు అమ్ముడై పలుసార్లు జరిగి - అది మరల మరల వస్తుసేవల ఉత్పత్తికి దారి తీస్తుంది. ఇదోక వినిమయ చక్రం.

 

ఈ సైకిల్ లో లాభాలు, ఫీజుల రూపంలో సంపద సృష్టించబడుతుంది. ఇదంతా వినియోగ దారుడు వినిమయం జరిపినప్పుడే. లేకుంటే సంపద సృష్టి ఆగిపోతుంది అప్పుడు అభివృద్ధి రధచక్రాలు నిలిచిపోతాయి.

 

వినియోగదారుడు స్వల్పంగా వినిమయం జరిపితే అభివృద్ధి స్వల్పంగా జరుగుతూ అభివృద్ధి మంద గమనంలో పడుతుంది. స్వల్ప కొనగోళ్ళలో వినియోగదారుని కొనగోళ్ళ ప్రాధమ్యాలు మారిపోతాయి. ముందుగా ఏవరైనా అహారం, నిత్యావసరాలు, ఆ తరవాత వస్త్రాలు, నివాసం, ఆరోగ్య, విద్య, వృత్తి అవసరాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

 

ఈ పరిస్థితుల్లో నిత్యావసరాలు, సాధారణ అవసరాలు ముఖ్యమౌతాయి. అవి తీరిన తరవాతే సౌకర్యాలు, సుఖ విలాసాలు ముందు ఆ వరసలో చేరుకుంటాయి. అందుకే దేశ ఆర్ధిక రంగం మందగమనంలో ఉన్నా "ఆహార దాన్యాలు తదితర నిత్యావసరాలు" వినిమయానికి ఢొఖా ఉండదు. కాని సౌకర్యాలు సుఖ విలాస జీవనానికి ఉపయోగపడే వస్తు వినిమయం ఇబ్బందుల్లో పడి ఆయా రంగాలు చిక్కుల్లో పడతాయి.

 

అలాంటి వాటిల్లో సామాన్యుని అధమ ప్రాధాన్యం వాహనాలు. వాహన కోనగోళ్ళు ఆర్ధిక మంద గమనంలో ఉరిమురిమి మంగలం మీద పడ్డట్టు కకావికలమౌతాయి. అందుకే ఆ రంగానికి ఎంత ఊతమిచ్చినా పుంజుకోవటం కష్టమౌతుంది. అందుకే భారత ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది. ఇది ఆర్ధిక మందగమనానికి సూచిక మాత్రమే కాదు సాదృశ్యమైన ఋజువు కూడా. ఒక వస్తువు వారి వృత్తికి తప్పనిసరైతే ఆ వస్తు కొనగోళ్ళు కొద్దిగా నైనా జరుగుతాయి.

 Image result for lamborghini car

కాని విలాసాల వస్తువుల కొనగోళ్ళకు ఆర్ధిక మందగమనం దాదాపుగా వర్తించదు. కారణం ఉన్నతవర్గాలలోని విలాసవంతులు కొనే వాహనాల వ్యాపారం సహజంగా, సాధారణంగానే జరుగుతుంది. ఎకనమిక్ స్లో డౌన్ లో ధరవరలు అనుకూలిస్తే అవసరం ఉన్నవారు ఆర్ధిక సౌలభ్యం ఉన్న ఉన్నత వర్గాల వారు చాన్స్ తీసుకోవటంతో డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోతుంది.

 

దీనికి ఉదాహరణే ఇటలీకి చెందిన లంబోర్గిని లాంటి విలాసవంతమైన కార్ల అమ్మకాలు మన దేశీయ మార్కెట్ లో ఈ ఆర్ధిక మందగమనంలో కూడా 30 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. ఇది నిజమని నిరూపిస్తూ లంబోర్గినికి చెందిన ₹3.00 కోట్ల ధర పలికే "ఉరుస్" బ్రాండ్ కారు కొత్తగా భారతీయ మార్కెట్లోకి వచ్చి. ఈ కార్లు 50 కి పైగా అమ్ముడైనట్లు ఆ కంపనీ భారత ఉన్నత అధికారి శరద్ అగర్వాల్ తెలిపారు. అంటే వారానికి ఒక కారు అమ్ముడైనట్లేకదా!

 

అసలు గత సంవత్సరం 45 లంబోర్గిని కార్లు అమ్మగా, ఈ ఏడాది లక్ష్యం 65 కాగా ఇప్పటికే 50 అమ్మేశారు. ఈ ప్రత్సాహంతో, రానున్న మూడేళ్ళ కాలానికి వారి అమ్మకాల లక్ష్యం ఏడాదికి 100 గా నిర్ణయించారు. ఇక్కడ ఆర్ధిక మాంద్యం దాని లక్షణాలు వర్తించవు. అయితే మద్యతరగతి ఎగువ మద్యతరగతి వర్గాలు విరివిగా కొనే సాధారణ కార్ల అమ్మకాలు దీనికి వ్యతిరేఖ దిశలో పయనించి 30 శాతం మించి పడిపోయాయి.

 Image result for lamborghini urus car

మరింత సమాచారం తెలుసుకోండి: