జగన్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడన్న పేరు సంపాదించుకున్నారు. అది కష్టమైనా, నష్టమైనా కూడా తన మాటకు కట్టుబడిఉండడం జగన్ నైజం. ఇక ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. అధికారం ఆయన చేతిలో ఉంది. ఇపుడు మాటలని చేతలలో చూపిస్తున్నారు. తాను చెప్పిన మాటలను ఒక్కోటిగా నెరవేరుస్తూ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ తాజాగా తీసుకున్న మరో నిర్ణయం ఇపుడు ఆ వర్గానికి జగన్ని దేవుడిగా చేసింది.


ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి 30 ఏళ్ళ పాటు లీజుకు ఇస్తూ గత టీడీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ రద్దు చేశారు. ఏజెన్సీలో ఎటువంటి తవ్వకాలు ఇకపై ఉండబోవని జగన్ స్పష్టం చేశారు. గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకున్న అన్ని నిర్ణయాలు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ పరిణామంతో గిరిజనం హర్షం చేస్తున్నారు. నిజానికి రెండేళ్ల క్రితం జగన్ ఈ ప్రాంతంలో పర్యటించినపుడు బాక్సైట్ తవ్వకలను ఇచ్చే అన్ని రకాల అనుమతులను రద్దు చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


దీని మీద డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ జగన్ గిరిజనులుకు చేసిన మేలు మరచిపోలేమని అన్నారు. దీనివల్ల జగన్ గిరిజనానికి మరింత చేరువ అయ్యారని అన్నారు. జగన్ మీద నమ్మకంతోనే అన్ని సీట్లలో గిరిజనులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించారని కూడా ఆమె చెప్పారు. రానున్న రోజుల్లో గిరిజనుల కోసం తమ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని కూడా చెప్పారు. కాగా జగన్ తాజా నిర్ణయంతో గిరిజనుల మద్దతుని పూర్తిగా పొందారన్నది నిజం. ఆయన వారికి దేవుడిగా మారిపోయారని చెప్పాలి. ఇప్పటికే ఏజెన్సీలో స్ట్రాంగ్ గా ఉన్న వైసీపీ తాజా పరిణామలతో మరింత బలంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: