రోజురోజుకు ఆన్ లైన్ లో ఈకామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. షాపింగ్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావటం, ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఎక్కువ వస్తువులు అందుబాటులో ఉండటంతో పాటు తక్కువ ధరకే వస్తూ ఉండటంతో వినియోగదారులు ఈకామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇకనుండి ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

చెన్నైకు చెందిన ఒక ముఠా 50 వేల రూపాయలకు పైగా ఆన్ లైన్ లో షాపింగ్ చేసిన వారికి గిఫ్ట్ ప్యాక్ లు ఇస్తామని మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఆన్ లైన్ లో ఒక బస్సును కొనుగోలు చేసాడు. కొన్నిరోజుల తరువాత ఆ వ్యక్తికి 50 వేల రూపాయల కంటే ఎక్కువగా ఆన్ లైన్ లో షాపింగ్ చేయటం వలన 12 లక్షల రూపాయల విలువ గల ఫ్రీ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని అశ్విన్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. 
 
గిఫ్ట్ ప్యాక్ డెలివరీ కోసం రోడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇతర పన్నుల కొరకు 96 వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తే గిఫ్ట్ ప్యాక్ వస్తుందని చెప్పి ఖాతాలో డబ్బులు జమ అయిన తరువాత మొబైల్ నంబర్లు స్విఛాఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తి కూడా గిఫ్ట్ ప్యాక్ వస్తుందనే ఆశతో 50,000 రూపాయలు మోసపోయాడు. రెండు కేసులు నమోదు కావటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి నిందితుల్ని పట్టుకున్నారు. 
 
హై టెక్నాలజీ ఉపయోగించి 50,000 రూపాయలకు పైగా ఆన్ లైన్ షాపింగ్ చేసేవారిని గుర్తించి ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కొత్త యాప్ లను రూపొందించి మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ ముఠా మూడు కోట్ల రూపాయలకు పైగా మోసాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: