ఇస్రో చేసిన ఘ‌న‌త గురించి ఇప్పుడు ప్ర‌పంచ దేశాలు కూడా భార‌త్ వైపు చూస్తున్నాయి. ఇస్రో చేప‌ట్టిన చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగంలో విక్ర‌మ్ ల్యాండింగ్ స‌మ‌యంలో సాంకేతిక కాణాల‌తో సంబంధాలు తెగిపోయి నిరాశ‌ప‌ర్చిన విష‌యం తెలిసిందే.  అయితే సాంకేతిక సంబంధాలు మెరుగు ప‌ర్చ‌డం కోసం ఇస్రో చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి.  అయితే అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (నాసా) ఇది వ‌ర‌కే చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. నాసాకు కూడా విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఎక్క‌డుందో జాడ తెలియ‌లేదు. తాజాగా నాసా ఈ రోజు చంద్ర‌యాన్ 2కు సంబంధించిన కీల‌క ఫోటోల‌ను విడుద‌ల చేసింది.  నాసాకు చెందిన లునార్ రికనైజాన్స్ ఆర్బిటర్ కెమెరా (ఎల్ఆర్వోసీ) చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను తీసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్-2ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ఇస్రో భావించినా  అది కుద‌ర‌లేదు. చంద్రయాన్-2 నుంచి వేరయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ చేసిందని పేర్కొంటూ.. అది హార్డ్ ల్యాండ్ అయిన ప్రదేశానికి సంబంధించిన హై-రిజల్యూషన్ ఫొటోలను నాసా విడుదల చేసింది. 

Lunar surface with names of locations

అయ‌తే విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ అయిన విషయాన్ని ఇస్రో కూడా ఇప్పటికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. విక్రమ్ ల్యాండ్ కావాల్సిన నిర్ధారిత ప్రదేశాన్ని ఎల్ఆర్వోసీ తన కెమెరాలో బంధించింది. చంద్రుడిపై 150 కిలోమీటర్ల పరిధి మేర చిత్రీక‌రించింది. అయితే, విక్రమ్ కచ్చితంగా ఎక్కడ హార్డ్ ల్యాండ్ చేసిందనేది ఇంకా గుర్తించాల్సి ఉందని నాసా పేర్కొంది. 


విక్ర‌మ్ కూలిన ప్ర‌దేశంలో ఎత్తు ప‌ల్లాలు:
అయితే .. విక్రమ్ కూలిన ప్రదేశంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండ‌టం, అందువల్ల అక్కడ నీడలు ఎక్కువగా పడుతున్నాయని, ఆ కార‌ణంగానే విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఎక్క‌డుందో స్ప‌ష్టంగా చెప్ప‌లేమ‌ని నాసా పేర్కొంది. LRO పంపిన ఫొటోలను వారం పాటూ... పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలు... వాటిలో విక్రమ్ ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం ల్యాండర్ కూలిన చోట వెలుతురు లేదు కాబట్టి... అక్టోబర్‌లో మళ్లీ సూర్యకాంతి పడినప్పుడు... LRO ద్వారా వెతికిస్తామని నాసా  తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: