రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి మరింతగా దిగజారిపోవాలని చంద్రబాబునాయుడు కోరుకుంటున్నారా ? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అలగే అనిపిస్తోంది.  తన హయాంలో సర్వ వ్యవస్ధలను గప్పిట్లో పెట్టుకుని భ్రష్టుపట్టించేశారు. అవినీతిని తారస్ధాయికి చేర్చారు. అందుకే అభివృద్ధి పాతాళానికి పడిపోయింది. తన ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం అప్పులను రూ. 2.7 లక్షల కోట్లకు చేర్చిన ఘనడు చంద్రబాబు.

 

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి  జగన్మోహన్ రెడ్డికి దాదాపు ఖాళీబొచ్చెను ఇచ్చారు. రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసేసిన చంద్రబాబు ఇపుడు ఆర్దిక పరిస్ధితిపై విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. పిపిఏల్లో భారీ అవినీతికి పాల్పడిన మాట వాస్తవం. వాటిని సమీక్షించి విద్యుత్ టారిఫ్ ధరలు తగ్గించి ప్రభుత్వానికి కాస్త ఆదాయాన్ని మిగులుద్దామని జగన్ ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు.

 

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు, చినబాబు ఏటిఎంలాగ వాడుకున్నారని ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఆరోపించారు. అంటే ఏ స్ధాయిలో అవినీతికి పాల్పడ్డారో అర్ధమైపోతోంది. అలాంటి ప్రాజెక్టులో రివర్స్ టెండర్లలో ప్రజాధనాన్ని ఆదా చేద్దామని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు.

 

ఆర్ధిక పరిస్ధితిని గాడిలో పెట్టటానికి జగన్ చేసే ప్రతీ ప్రయత్నాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో రాష్ట్రం ఇంకా దిగజారిపోవటమే చంద్రబాబు కోరుకుంటున్నారా ? అనే సందేహాలు వస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూపించి ఆందోళనలని, నిరసనలని నానా యాగీ చేస్తున్నారు.

 

ఒకవైపు విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు వచ్చి జగన్ తో సమావేశమవుతుంటే దాన్ని కూడా సహించలేకపోతున్నారు. జగన్ పాలనలో పరిశ్రమలన్నీ తిరిగి వెళిపోతున్నాయంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఇంతా చేసి జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయ్యింది. ఈ నాలుగు నెలల్లోనే వచ్చిన పరిశ్రమలేంటి ? పరిపాలన బాగా లేదని చెప్పి తిరిగి వెళ్ళిపోయిన పరిశ్రమలెన్ని ?

 

చూస్తంటే జగన్ హయాంలో పరిపాలన ఎక్కడ పుంజుకుంటుందో మళ్ళీ తనకు అవకాశం రాదేమో అన్న టెన్షనే ఎక్కువవుతున్నట్లుంది. అందుకనే ప్రతి విషయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: