మహాత్మాగాంధీకి ఇజ్రాయిల్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని షాక్ అవ్వకండి.  మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలను భారతదేశం అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్న సంగతి తెలిసిందే.  ఆరోజు నుంచి దేశంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.  ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని తీసుకురావడానికి సిద్ధం అయ్యింది.  కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ లలో ప్లాస్టిక్ ను నిషేదించారు.  వాటి స్థానంలో గ్లాస్ లేదా స్టీల్ బాటిల్ లను వినియోగిస్తున్నారు.  


దీంతో పాటు అనేక కార్పొరేట్ ఆఫీస్ లలో కూడా ప్లాస్టిక్ ను నిషేధించి గాజు బాటిల్స్ ను ప్రవేశపెడుతున్నారు.  ఇదిలా ఉంటె, మహాత్మాగాంధీ 150 వ జయంతోత్సవాల సందర్భంగా ఇజ్రాయిల్ ఓ లేఖను బయటపెట్టింది.  సెప్టెంబర్ 1, 1939లో మహాత్మాగాంధీ తన స్వదస్తూరీతో రాసిన లేఖ అది.  ఈ లేఖను అప్పటి బాంబైలోని యూదు ప్రతినిధి ఏఈ షోహెట్ కు రాశారు.  అవి యూదులను నాజీలు హింసించిన రోజులు. నాజీల చేతిలో ఎంతో మంది యూదులు బాధింపబడ్డారు.  


ఈ సందర్భంగానే మహాత్మాగాంధీ షోహెట్ కు లేఖ రాశారు.  శాంతి శకం ఆరంభం కావాలని కోరుకుంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.  కాగా, ఏ లేఖ ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జాతీయ గ్రంధాలయంలో ఉన్నది.  20 వ శతాబ్దానికి సంబంధించిన చారిత్రాత్మక అధరాలు, జ్ఞాపకాలకు సంబంధించిన వెలికి తీసే క్రమంలో ఈ లేఖ బయటకు వచ్చింది.  వెంటనే ఇజ్రాయిల్ ఈ లేఖను ఆన్లైన్ లో ఉంచింది.  


మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇండియా కృషి చేస్తున్న సమయంలో ఈ లేఖ వెలుగులోకి రావడం విశేషం. ఇది నిజంగా అభినందించదగిన విషయంగా చెప్పాలి.  అక్టోబర్ 2 నుంచి ఇండియా పర్యావరణానికి సంబంధించిన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. చట్టాలు కఠినంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: