భార్య భర్తల మధ్య వుండాల్సింది నమ్మకం అనే పునాది.అది ఎంతగట్టిగా ఉంటే ఆబంధం అంతకాలం నిలబడుతుంది. అందుకు ఉదాహరణగా అక్కడక్కడ కొందరు కనిపిస్తూ వుంటారు.వయస్సు ముదిరిన వారిమధ్య వుండే ప్రేమ నిత్యనూతనం గా నిత్యం విరబూస్తుంది.నిలువెల్లా ప్రేమను వర్షించే ఆ కళ్లలోకి అలా చూస్తుండి పోనివ్వవా అంటూ మూగ బాషలు చేస్తుంది. ఇది ఒక్కప్పటి మాట.ఇప్పటి జంటల ముచ్చట్లు ఎలా వున్నాయంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం కంటే అవసరం ఎక్కువగా వుంది.ఆ అవసరాలకోసం సంపాదన కావాలి.ఆ సంపాదన ఎలా వచ్చిన ఫర్వాలేదు దానితో మస్తుగా ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తారు..



మరికొంతమంది భర్తలు భార్య ఇంట్లో లేకపోతే చాలు,ఇంటికి అమ్మాయిలను తెచ్చుకుని పండగ చేసుకుంటారు.ఇలాంటి పనులు ఒక్కోసారి చిక్కుల్లోకి నెట్టేస్తాయి.ఇలాంటి సంఘటనే ఓ మహిళకు ఎదురైంది.ఆమెను సమస్యల్లోకి నెట్టింది.ఆ వివరాలేంటో చూద్దాం..పుణేకు చెందిన ఓ జంటకు గత కొంతకాలంగా గొడవలతో అసలు పడటం లేదు. అందువల్ల వారు విడిపోవాలని నిర్ణయించుకుని విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు.అయితే,కోర్టు తగిన ఆధారాలను తమకు సమర్పిస్తే తప్పకుండా విడాకులు మంజూరు చేస్తామని చెప్పిందట.ఇక వారిమధ్య విడాకులు త్వరగా మంజూరు కావాలంటే భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఆమె తమ పడక గదిలో రహస్య కెమేరాను ఏర్పాటు చేసింది.



ఆమె అనుకున్నట్లుగానే తన భర్త ప్రియురాలిని వెంటేసుకుని తమ యింట్లో తెగ ఎంజాయ్ చేస్తున్న సీన్స్ అన్ని ఏం చక్కా రికార్డు అయ్యాయట.ఇవి చాలు తమ విడాకులకు అని ఆ వీడియోలను కోర్టుకు అప్పగించింది.అయితే,ఇక్కడే ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.ఆ వీడియోలో ఉన్న తన భర్త ప్రియురాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ,తన ప్రైవసీకి భంగం కలిగించిందంటూ పోలీసులకూ ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు అతని భార్యను అరెస్టు చేశారు.ఇక ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం,భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ 354,507,120 కింద ఆమెపై కేసులు నమోదు చేశామని తెలిపారు.చూసారుగా నాలుగు గోడలమధ్య నాటకం చివరకు వీధి నాటకంలా మారి ఎంత పని చేసిందో..


మరింత సమాచారం తెలుసుకోండి: