ఈ మందుని మనలో చాలా మంది వయసు పైబడినవారు మరియు ఆహారం సరిగ్గా జీర్ణం కాని వారు ఎంతోమంది ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటారు. కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలను తగ్గించేందుకు ఉపయోగించే ఈ మందులో తాజాగా అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డీ.ఏ) వారు క్యాన్సర్ కారక పదార్థాలను కనుక్కున్నారు. దీనినే మనం ఏదైనా మందుల షాపుకి వెళ్లి కడుపులో మంటగా ఉంది అంటే వెంటనే మన చేతిలో పెడతారు. అది కాస్తా మనకి క్యాన్సర్లు తెలుస్తుంది. ఇంత హానికరమైన మందు మనలో చాలామంది ప్రతిరోజూ వాడుతుంటారు అదే 'రాంటాక్' (RANTAC) అనగా ర్యానిటిడిన్ హైడ్రో క్లోరైడ్ (ranitidine hydrochloride). ఇది యాంటాసిడ్ క్లాస్ కు చెందినది.

గ్యాస్టిక్ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ని రోజులు మొదటి ఛాయిస్ గా ఈ డ్రగ్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇక మీదట ఈ మందు వాడకం పై ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అమెరికాకి చెందిన ఫార్మా కంపెనీ అయినా శాండుజ్ ఈనెల 23వ తేదీన 'నైట్రోసోడైమిథైలమైన్' (NDMA) అనబడే క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మందు లో NDMA ఉండాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా ఉండటం మరియు దీని తయారీలో ఏదో లోపం వల్ల ఏర్పడిన ఈ కలుషిత మిశ్రమానికి క్యాన్సర్ ను కలగజేసే శక్తి ఉందని వారు వెల్లడించారు.

దీంతో ఆ దేశం నుంచి 2017 మరియు 2018 లో తయారైన 14 బ్యాచ్ లకు చెందిన మందులను వారు ఉపసంహరించుకొని నాశనం చేశారు. ఇవి 2020 మరియు 2021 వరకు ఎక్స్పైరీ డేట్ ను కలిగి ఉండగా వాటిని ఇప్పుడే నాశనం చేశారు. ఈ NDMA అనేది మనుషుల్లో కేన్సర్ కలుగజేస్తుందని ఎన్నో ల్యాబరేటరీ టెస్టుల ద్వారా నిర్ధారించారు. సాధారణంగా మన వాతావరణంలో ఉండే ఈ కలిసి పదార్థం నీళ్లలో, ఆహారంలో, మాంసంలో, పాల ఉత్పత్తుల్లో మరియు కూరగాయల్లో కూడా ఉంటుంది.

దీంతో ఇక నుంచి 'రాంటాక్' మందు బదులు గ్యాస్టిక్ యాసిడ్ తగ్గించేందుకు ఉన్న మరెన్నో మందుల్ని ఉత్తమమని ఎఫ్.డీ.ఏ హెచ్చరికలు జారీ చేసింది. మీరు కూడా ఇకపై మందుల షాప్ వారు ఇచ్చే మందుని ఒకటికి రెండుసార్లు దాని పేరుని చెక్ చేసుకుని వాడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: