గత కొద్ది రోజులుగా గ్రామ సెక్రటరీ ఉద్యోగాలకు జరిగిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు చాలా ఆరోపణలు జగన్ మోహన్ రెడ్డి పై మరియు అతని ప్రభుత్వంపై వస్తున్నాయి. వాటి ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఉద్యోగాలు చెందాలి అనే ఉద్దేశంతో ప్రశ్నాపత్రాలను ముందే లీక్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇకపోతే మన పచ్చ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. వారం రోజులుగా ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేవలం గాసిప్పులు మరియు రూమర్లతో తెగ ఊదరగొడుతున్నారు.

అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు తనపై, తన ప్రభుత్వంపై ఇలాంటి అబద్ధపు ఆరోపణలు మరియు చేస్తున్న వారు ఎవరు అని కనిపెట్టి ఒక నివేదిక తయారు చేయమని ఆదేశించారు. వారు జరిపిన విచారణలో తేలింది ఏమిటంటే... 2016 నవంబర్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమింపబడిన పి. ఉదయ్ భాస్కర్ ఇప్పుడు జగన్ పై వస్తున్న ఈ ఆరోపణలు అన్నిటిలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. పచ్చి అబద్ధమైన క్వశ్చన్ పేపర్ లీకేజీ లో ఆయన ఒక బృందంతో జగన్ ప్రభుత్వం పై వీలైనంత మచ్చలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని తేలిందట.

ఇకపోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరియు ఉదయభాస్కర్ కలిసి జగన్ పై ఈ పన్నాగాన్ని పన్నినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇటువంటి పనులు చేస్తున్నా ఏపీపీఎస్సీ చైర్మన్ పైన చర్యలు తీసుకునేందుకు జగన్ కు ఎలాంటి అధికారం లేకపోవడం గమనార్హం. ఇది రాజ్యాంగబద్ధమైన ఉద్యోగం కాబట్టి కేవలం భారతదేశ ప్రెసిడెంట్ కే సదరు అధికారిని విధుల నుంచి తప్పించే అధికారం ఉంటుంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక ఎంక్వైరీ విధించి అతనిని దోషిగా తేల్చి ప్రెసిడెంట్ కి పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తుందో అప్పుడే ప్రెసిడెంట్ అయినా కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ ను అతని విధుల నుంచి తొలగించవచ్చు. అప్పటి వరకు ఎవరి ఆటలు వాళ్ళవి.


మరింత సమాచారం తెలుసుకోండి: