ఇపుడు ఉన్న అధునాతన సాంకేతిక సంపత్తిని ఉపయోగించుకుని ఎటువంటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేస్తున్నారు. అయినా కొన్ని పనులు మాత్రం ఇంకా చేయలేని పరిస్థితి ఉంది. ఉదాహరణగా కళ్ళముందే  రాజమహేంద్రవరంలో మూడు వందల అడుగుల లోతున మునిగిన ట్రావెలింగ్ బోటు, ఈ ప్రమాదంలో యాభై మంది వరకూ మరణించారు. ఇంకా 14 మ్రుతదేహాలు రావాలి. అయినా ఆచూకీ దొరకడంలేదు.


దీని మీద మంత్రి కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటివరకూ జరిగిన సహాయ చర్యలు ఒక ఎత్తుగా ఉన్నాయి, ఇక బోటు తీయడం అన్నది ప్రభుత్వం పరంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మూడు వందల అడుగుల్లో బోటు ఉండడం వల్ల తీయలేకపోతున్నామని అన్నారు.  ఇంకా ఎస్టీఆరెఫ్, ఎండీఆరెఫ్ బ్రుందాలు గాలిస్తున్నాయని మంత్రి చెప్పారుఈ విషయంలో దేశంలోని నిపుణులను రప్పించి చెయాల్సినది చేస్తున్నామని ఆయన అన్నారు. కుచ్చులూరు దగ్గర బోటు సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయిందని కన్నబాబు చెప్పారు. ఇకా ఆచూకీ లభించని వారి బంధువులు  డెత్ సర్టిఫికేట్ కోరుతున్నారని మంత్రి తెలిపారు  ఈ విషయంలో  ప్రభుత్వపరంగా చేయాల్సింది చేస్తున్నామని ఆయన అన్నారు.


ఇదిలా ఉండగా ప్రభుత్వానికి సహకరించి అనేకమందిని కాపాడిన కుచ్చులూరు గిరిజనులకు ఒక్కరికీ 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని ఆయన అన్నారు. కాగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైన వచ్చి బోటు తీస్తామంటే తప్పకుండా అధికారులకు సహకరించవచ్చునని మంత్రి చెప్పారు. ఇక గత టీడీపీ సర్కార్ జారీ చేసిన జీవో పూర్తి అయోమయంగా క్లారిటీ లేకుండా ఉందని మంత్రి అన్నారు. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వం ఓ కమిటీని వేసిందని ఆయన చెప్పారు. ఆ కమిటీ సిఫార్సుల  మేరకు ఏం చేయాలో చేస్తామని, భవిష్యత్తులో ఈ ఘటనలు పునరావ్తుత్తం కాకుండా చూస్తామని కన్నబాబు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: