గోదావరిలో బోటు ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసంబద్దమైన వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ బోటు ప్రమాద ఘటనలో గాలింపు చర్యలు ఇంకా  కొనసాగుతున్నాయని చెప్పారు.  ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 26 మందిని రక్షించడం జరిగిందన్నారు. అందుకు దోహదపడిన  స్థానికులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహాకాలను అందచేస్తునట్టు తెలిపారు. ప్రాణాలకు తెగించి ప్రయాణీకులను కచ్చులూరు గ్రామస్తులు కాపాడారని ఈ సందర్బంగా మంత్రి చెప్పారు. వారి సాహసాన్ని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభినందించారన్నారు. వారందరికీ ఒక్కొక్కరికి ఇరవై అయిదు వేల రూపాయలు చొప్పున ప్రోత్సహాకాణాలు ఇస్తామని చెప్పారు. అధికారుల నుంచి వారి వివరాలను పంపించాలని కూడా కలెక్టర్‌ ను కోరామన్నారు. వారిని గుర్తించడం ఈ ప్రభుత్వ బాధ్యత.త్వరలోనే వారికి ఈ ప్రోత్సాహకాలను అందచేస్తామని చెప్పారు. ఎవరైనా సరే ముగినిపోయిన బోటును తీస్తామని ముందుకు వస్తే అలంటి వారికీ ప్రాహుత్వా పరంగా పూర్తి సహకారాన్ని అందిసమని చెప్పారు. ఈ విషయంలో నిపుణులతో చర్చించి మరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో    వారికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. 



బోటును బయటకు తీసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వుందన్నారు.  దీనిపై రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్‌ నాయకుడు కూడా అసంబద్దంగా మాట్లాడుతున్నారు. దేశంలో ఇంత లోతులో.. ప్రవాహంలో మునిగివున్న లాంచీని బయటకు తీయలేదన్నారు.ఎవరైనా మేం తీయగలుగుతామని చెబితే... -వారికి పూర్తి సహకారంను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
స్థానికంగా గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. వందలాది మంది ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తూనే వున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని చెప్పారు. ఇంకా ఆచూకీ లభ్యంకాని వ్యక్తులకు బంధువులు డెత్‌ సర్టిఫికేట్లు  కోరుతున్నారని చెప్పారు. దీనిని సాంకేతికంగా ఏలా చేయాలో పరిశీలిస్తున్నాం. వారి విజ్ఞప్తికి అనుకూలంగా చర్యలు తీసుకుంటాం
బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడింది. వారికి రాజమండ్రిలో వసతులు, సమాచారం అందించాం. ఇలాంటి సంఘటనలు పునారవృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.



బోటు ప్రమాదాల నేపధ్యంలో 2018లో ఒక జీఓ ఇచ్చారు.నీటిమీద నడిచే వాహనాల నియంత్రణపై ఇందులో నిబంధనలు వున్నాయి.
ఏ డిపార్ట్‌ మెంట్‌ ఏం చేయాలో మాత్రమే దీనిలో చెప్పారు. దీనిని ఎవరు సమన్వయం చేయాలో చెప్పలేదు. ఫలితంగా దీనిని అమలుచేసే విషయంలో ఇబ్బంది ఎదురయ్యింది. పడవ సామర్ధ్యంను కాకినాడ పోర్ట్‌ అధికారి నిర్ధారిస్తారు. రివర్‌ కన్సర్వేటర్‌ ద్వారా రూట్‌ పర్మీషన్‌ ఇవ్వాలని జిఓలో సూచించారు. మొత్తంగా పడవ ప్రయాణీకుల భద్రతను ఎలా సమన్వయం చేయాలో స్పష్టత లేదు. తాజా ప్రమాద ఘటన తరువాత ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తరువాత దానిని అధ్యయనం చేయాలని సిఎం జగన్ 
సూచించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బోటు ప్రయాణంపై కంట్రోల్‌ రూం లను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ఈ పడవ ప్రమాదంలో పడవ నడిపిన డ్రైవర్ల బాడీలు దొరకలేదు.ఆరోజు ప్రమాద ఘటనాస్థలం గోదావరిలో అత్యధికంగా లోతు వుండే ప్రాంతమది.  పక్కనుంచి వెళ్లి... ముందుకు వెళ్లిన తరువాత బోటు డైవర్ట్ కావాలన్నారు. ఈ ప్రాంతంలో సుడిగుండాలు తీవ్రంగా వున్నాయి.




కనురెప్పపాటులో ప్రమాదం జరిగిపోయిందని బయటపడిన వారు చెప్పారని మంత్రి ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఇటువంటివి ఎప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకు వుందన్నారు. దేవీపట్నం పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు సదరు బోటును తనిఖీ చేశారు. బోటులో మద్యం లేదని, లైఫ్‌ జాకెట్లు ధరించారని పోలీసులు నిర్ధారించారు. పరిమితికి అనుగుణంగానే ఆనాడు బోటులో ప్రయాణీకులు ఎక్ట్వల్ ఏజెన్సీ, బోటు నిర్వాహకులు, బాధితుల బంధువుల సమాచారం, ప్రమాదానికి ముందు బయటపడిన వారి వద్ద వున్న ఫోటోలను కూడా పరిశీలించి ప్రయాణీకులను గుర్తించాం. మొత్తం 77 మంది బోటులో వున్నట్లు నిర్ధారించాం. ముఖ్యమంత్రి గంటన్నర పాటు రాజమండ్రిలోసమీక్ష జరిపారు.పడవ ప్రమాదాలు జరగకుండా మ్యానువల్ రూపొందించాలని ఆదేశించారు.నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. జిపిఎస్‌ సిస్టమ్, సిసి కెమేరాలు, ఆధునిక నావిగేషన్‌ పరికరాలు వుండాలని మంత్రి కన్నబాబు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: