మెగాస్టార్ చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్ర పోషించినంత మాత్రాన ఆయన భారత జాతీయ స్వాతంత్ర సమరయోధుడు కాలేరు. ప్రధమ స్వాతంత్ర పోరాటం-సిపాయిల తిరుగుబాటు పేరుతో ఝాన్సి రాజ్యానికి రాణి అయిన లక్ష్మీబాయి (మణికర్ణిక) నాయకత్వంలో జరిగింది. ఇది బ్రిటీష్ వారు రాసుకున్న బ్రిటీష్ - ఇండియా చరిత్రలో కూడా నమోదైంది.


1857–-58 లో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంగా చెపుతారు. భారత జాతి క్లిష్ట సమయంలో బానిస శృంకలాలతో జీవిస్తున్న వేళ లక్ష్మీబాయి (1828  1858) ఉత్తర భారత రాజ్యమైన ఝాన్సీకి రాణి, 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకొని ఈమె వాళ్ల గుండెల్లో జలధరింపు కలిగించారు. "ఇండియాస్ జాన్ ఆఫ్ ఆర్క్" గా ఆమె భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంగ్రామం ఒక విఫల ప్రయత్నంగా నిలిచినా బ్రిటీష్ వాళ్ళ పాలనకు తొలి కుదుపుగా నిలిచింది. 
   
అయితే భారత ఉపఖండంలో స్వాతంత్ర సమూపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్రోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్, పోర్చుగీస్ (బుడతగీసు) తదితర వలస పాలకుల పాలనకు చరమగీతం పాడటానికి వివిధ సిద్దాంతాల ప్రాతిపదికగా పలు ప్రాంతాల్లో సంఘటితమైన రాజకీయపక్షాలుగా ఏర్పడి ఉద్యమించాయి. 


అయితే 16 వ శతాబ్దములో పోర్చుగీసు వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా ‘రాణి అబ్బక్క’ (1525-1570) చేసిన పోరాటం భారత్ లో వలస వాదులపై జరిగిన తొలి స్వాతంత్ర సమరంగా చెప్పవచ్చు – రాణి అబ్బక్క చౌతా — ఉళ్ళాల రాజ్యానికి రాణి. 16వ శతాబ్దంలో  పోర్చుగల్ సైన్యంతో పోరాడారు. ఆమె. చౌతా వంశానికి చెందిన అబ్బక్క కర్ణాటకలోని మంగళూరు ప్రాంతాన్ని పరిపాలించారు. ఆమె వంశస్థులు ఈ ప్రాంతాన్ని చాలా ఏళ్ళ నుంచీ పాలిస్తున్నారు. వీరి రాజధాని పుట్టిగె. రాజ్యంలో ఉన్న రేవు పట్టణం ఉళ్ళాల దానికి ఇంకో రాజధానిగా ఉండేది.
rani abbakka chowta కోసం చిత్ర ఫలితం
ఈ ప్రాంతం భౌగోళికం గా ప్రాముఖ్యత ఉండటంతో ఎన్నోసార్లు ఈ రాజ్యాన్ని ఆక్రమించేందుకు పోర్చుగీస్ వాళ్ళు ప్రయత్నించారు. కానీ అబ్బక్క ఆ ప్రయత్నాలు అన్నింటినీ తిప్పికొట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వాళ్ళను నిలవరించారు ఆమె. నిర్భయంగా ఆమె చేసిన ఈ పోరాటానికి గుర్తుగా ఆమెను అభయ రాణిగా పిలిచేవారు. వలస పరిపాలకులపై పోరాటం చేసిన భారతీయుల్లో ఈమే మొదటి వారు కావడం విశేషం. అంతేకాక అబ్బక్క మొట్టమొదటి మహిళా స్వతంత్ర పోరాట యోధురాలు కూడా.


ఆమెను స్పూర్తిగా తీసుకొని తరవాత కాలంలో  కిత్తూరు చెన్నమ్మ, కేళడి చెన్నమ్మ, ఒనకె ఒబవ్వ లాంటి మహిళా స్వాతంత్ర యోధులు నిర్భయంగా బ్రిటీష్ వారిని పోర్చుగీస్ వారిని ఎదురోడ్డి మహిళా యోధులుగా చరిత్రలో నిలిచారు. 


17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో - బ్రిటీష్ వారి - ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను బ్రిటీష్ వలస పాలనపై ప్రజా వ్యతిరేకతకు తొలి  అడుగులుగా చెప్పవచ్చు. 


మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భవించి మన దేశ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరులూదింది. అంతేకాదు మహత్మ గాంధి నాయకత్వంలో స్వాతంత్రం లభించేవరకు ఉద్యమాన్ని నడిపి విజయం సాధించింది. ఇంతటి గౌరవ ప్రదమైన భారత స్వాతంత్ర సంగ్రామానికి "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" అనబడే ఒక పాలెగార్ (కనీసం ఒక జమీ కి కూడా నాయకుడు కాదు) బ్రిటీష్ ను ఎదిరించిన చరిత్ర లేదని చరిత్రకారుల అభిప్రాయం. ఆయన  తనకు బ్రిటీష్ వారి నుండి రావలసిన పెన్షన్ కోసం మాత్రమే పోరాడారని బలంగా చెపుతున్నారు.

Image result for uyyalawada narasimha reddy

మరో ముఖ్య విషయం ఉయ్యాలవాడ వంశంవారు తమ ప్రపితామహుని (పూర్వీకుని) చరిత్ర వెండితెరకు ఎక్కుతుంటే అమితానందాన్ని పోందాల్సిన వేళ - అది మరచి ఆయన పెన్షన్ కోసం పోరాడినట్లు - నిర్మాత రాం చరణ్ గ్రామాభివృద్ధికైతే సహకరిస్తానన్నప్పుడు అంగీకరించకుండా తమకు ఆ సినిమాలో వాటాగా ₹ 50  కోట్లు రావాలని కోరటం మాత్రం యాధృచ్చికం కాదేమో? 


సైరా - పేరుతో మెగాస్టార్ చిరంజీవి నటించిన చలనచిత్రం ఏ మాత్రమూ చరిత్రాత్మక  భారత స్వతంత్ర సంగ్రామం కాదని చెప్పవచ్చు. తన జీవనాధారమైన పెన్షన్ కోల్పోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతీయ అధికారి తో(కలక్టర్ కావచ్చు) పోరాడినంత మాత్రాన ఆయన స్వాతంత్ర సమరయోధుడని - ఆయనదే తొలి స్వాతంత్ర సంగ్రామని ప్రచారం చేసుకోవటం చిరంజీవి అంతటి మహానటునికి గౌరవ ప్రదం కాదేమో?  సైరా చరిత్ర కాదు బాహుబలి, మగధీర సినిమాల్లా కల్పిత కథ మాత్రమే.   

మరింత సమాచారం తెలుసుకోండి: