ఆంధ్ర ప్రదేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరికి అదిరిపోయే వరాలు ఇచ్చాడు. ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ అధికారలతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.                          


రాష్ట్రంలో నగరాలు, మున్సిపాల్టీలలో సదుపాయాల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు సచివాలయ వ్యవస్థను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజక వర్గంపై వరాల జల్లు కురిపించారు.                     


వైఎస్ జగన్ ఈరోజు రివ్యూ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. తాడేపల్లి, మంగళగిరిలను ఆదర్శ మున్సిపాల్టీలుగా తయారు చేయాలని, అక్కడ ఇళ్లులేని వారందరికీ ఇళ్లు కేటాయించాలని, తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలని, ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. కాగా తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం జగన్ ఆదేశించారు. 


కాగా కృష్ణానది కట్టమీద, లోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి మరో వరం ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం కింద ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర భూమి కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో కోరుకున్న చోట వారికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు.                                


మరింత సమాచారం తెలుసుకోండి: