ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేన్సర్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి మానవుల శరీరంలోకి కేన్సర్ కణాలు చేరాయంటే ఆ కణాలు శరీరం అంతా వ్యాపించి మనిషి చావుకు కారణం అవుతున్నాయి. కేన్సర్  తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తించటం ద్వారా మానవుల జీవిత కాలాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. కేన్సర్ వ్యాధికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 
 
కానీ ఈ చికిత్సలేవీ కేన్సర్ కణాలను పూర్తి స్థాయిలో నాశనం మాత్రం చేయలేకపోతున్నాయి. కేన్సర్ వ్యాధి వచ్చిన తరువాత ఈ వ్యాధి నుండి బయటపడినవారి సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో ఉంది. ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ లాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నా ఈ చికిత్సలు చేయించుకోలేనంత ఖరీదుతో ఉండటంతో పాటు ఈ చికిత్స ద్వారా ఏర్పడే నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. చికిత్స తరువాత  సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. 
 
కానీ ఇకముందు కేన్సర్ వ్యాధి వస్తే భయపడాల్సిన అవసరం లేకుండా కొత్త చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. కేవలం లైటుతో కేన్సర్ కణాలను పూర్తిగా తొలగించే కొత్త థెరపీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ ఫ్లాష్ లైటులో ఉండే ఇరీడియం యాక్టివేట్ అవటంతో విడుదలయ్యే నికోటినామైడ్ అడినైన్ డిన్యుసెలోటైడ్ కేన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది. 
 
ఈ థెరపీ ద్వారా ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉన్నా కూడా కేన్సర్ కణాలు సులభంగా నాశనం అవుతాయి. ఈ లైట్ ఫ్లాష్ పడితే ట్యూమర్ వ్యాపించిన కణాలు అన్నీ పూర్తిగా నాశనం అవుతాయి. ఈ చికిత్స ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవని తెలుస్తోంది. ఈ కొత్త చికిత్స ద్వారా ప్రపంచ స్థాయిలో లక్షల సంఖ్యలో కేన్సర్ మరణాలను ఆపే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ చికిత్స పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: