హైద‌రాబాద్‌లోని నీలోఫ‌ర్ ఆస్ప‌త్ర‌రిలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు ఫార్మ కంపెనీల డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి నీచంగా త‌యార‌వుతున్నారు వైద్యులు. దేవుడి తర్వాత వైద్యులే దేవుళ్లుగా భావిస్తుంటారు. అలాంటి వారే  చిన్నారుల పాలిట శాపాలుగా మారుతున్నారు. అభం, శుభం  ఎరుగ‌ని చిన్నారుల‌పై ప్ర‌యోగాలు చేస్తూ, డబ్బులు దండుకుంటున్నారు. ఆస్ప‌త్రికి వ‌చ్చే చిన్నారుల‌పై వైద్యులు క్లినిక‌ల్ ప్ర‌యోగాలు చేస్తున్నారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న త‌ల్లిదండ్రులు ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. 


ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఆస్ప‌త్రికి వ‌చ్చిన చిన్నారుల‌కు ఎలాంటి మందులు ఇస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని త‌ల్లిదండ్రులు అంటున్నారు. ఈ కార‌ణంతో చిన్నారులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నార‌ర‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఇలాంటి వైద్యుల‌పై అధికారులు చ‌ట్ట‌రీత్య చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిల్ల‌ల త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నీలోఫ‌ర‌ర్ ఆస్ప‌త్రి జూనియ‌ర్ డాక్ట‌ర్ల వాద‌న మ‌రోలా ఉంది. ఆస్ప‌త్రిలో ఎలాంటి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌డం లేద‌ని చెబుతున్నారు. చిన్నారులు ఆస్ప‌త్రికి వ‌చ్చినప్ప‌టి నుంచి డిశ్చార్జ్ అయ్యే వ‌ర‌కు తాము అన్ని విధాలుగా వైద్యం అందిస్తున్నామ‌ని, త‌మ ప్ర‌మేయం లేకుండా ఎలాంటివి కూడా ఆస్ప‌త్రిలో జ‌రిగే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు వైద్యులు.  అయితే ఫార్మా కంపెనీలతో కుమ్మక్కైన ఓ ప్రొఫెసర్ వైద్యం కోసం ఆస్పత్రిలో చేరే చిన్నారులపై ప్రైవేట్ ఫార్మా కంపెనీల మెడిసిన్, వ్యాక్సిన్ ఇలా ప్రయోగిస్తున్నట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.


ప్రైవేటు ఫార్మా కంపెనీల ప్ర‌లోభాల‌కు లొంగిపోయి....
ప్రైవేట్ ఫార్మా కంపెనీల డబ్బు ప్రలోభాలకు లొంగిపోయి కొంతమంది వైద్యులు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ త‌తంగం అంతా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ఇద్దరు డాక్ట‌ర్ల‌ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ విషయం బ‌య‌ట‌కు పొక్కిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 50మంది చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయని గుర్తించినట్టు స‌మాచారం. చిన్న పిల్లలపై ప్రయోగించిన నిషేధిత మందులను కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: